’అన్న పవన్ అన్నకీ నీ అపార్దాలతో దూరంగా వుండకు... ఒంటరిగా యుద్ధం చేస్తున్న వ్యక్తికి కొంచెం రిలీఫ్ నీలాంటి వాళ్ళు.. సమయం దొరికినప్పుడు కలువు.. ఆయన్నీ అర్థం చేసుకోలేక చాలా మంది సన్నిహితులు దూరం అయ్యారు..మీరు అలా కావద్దు‘ అన్న నెటిజన్ కు తన స్టైల్లో సమాధానం ఇచ్చారు నిర్మాత బండ్ల గణేష్. అదేవిధంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్‌లో బండ్ల గణేష్ తెలియని వారి ఉండరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలోకి వచ్చిన ఆయన తర్వాత బిజీ కమెడియన్‌గా మారిపోయారు. ఆ తర్వాత నిర్మాతగా మారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించారు. అయితే రాజకీయాల్లోకి వచ్చి చేతులు కాల్చుకున్నాడు. ఏదైనా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతాడు. ఆయన వేసే డైలాగులు హెలెరియస్‌గా ఉంటాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీర భక్తుడునని చెప్పుకునే ఆయనపై పలుమార్లు విమర్శలు సైతం చేస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. అటు తెలంగాణ రాజకీయాల గురించి, ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తనకు నచ్చిన విధంగా సమాధానాలిచ్చారుు.
జర్నలిస్ట్ జాఫర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ మాట్లాడుతూ..అటు తెలంగాణ, ఇటు ఏపీ రాజకీయాలపై ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమా అనే ప్రశ్నకు .. భగవద్గీత, తన తల్లిదండ్రుల సాక్షిగా తనంటే ఎంతో ఇష్టమని అన్నారు. తన గోల్స్ వైపుగా వెళ్తున్నారని, తాను అడ్డుగోడగా ఉండకూడదనే దూరంగా ఉంటున్నానని అన్నారు. ప్రస్తుత రాజకీయాలకు తాను సరిపోనని అన్నారు. జగన్ పాలన బాగుందని అన్నారు. ‘జగన్ ఓడిపోవాలని ఎప్పుడూ అనుకోలేదని.. అలాగే చంద్రబాబు-పవన్ కళ్యాణ్‌ల కూటమి గెలవాలని కూడా అనుకోవడం లేదు’అని చెప్పారు. ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ఫ్రీ పథకాలు ఉండకూడదనన్నారు. రేవంత్ రెడ్డి గ్రేట్ లీడర్ అని పొగిడారు. కేసీఆర్ బ్రహ్మండంగా పరిపాలిస్తున్నారన్నారు. క్రికెట్ టీంలో 11 మంది బాగా ఆడితేనే మ్యాచ్ గెలుస్తుందని అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని, అయితే ఎప్పుడు అవుతాడో చెప్పలేనని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు అధికారంలోకి వస్తారు అనే మాటకు తెలియదన్నారు. టీడీపి, జనసేన కలిస్తే పరిస్థితి ఏంటని అడగ్గా.. ‘ టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్నట్టు వాళ్లు మీతో చెప్పారా? టీడీపీ, జనసేన కలిస్తే కడుపొస్తుందా? కడుపు రాకుండా డెలివరీ అవుతుందా? ఇవన్నీ నాకేం తెలుసు? ఆంధ్రా రాజకీయాల గురించి నేనేం చెప్తాను. జగన్ పరిపాలన చాలా బాగుంది. విద్య, వైద్యం తప్పితే ప్రజలకు ఉచిత పథకాలు ఇవ్వకూడదని అంటున్నా. జనానికి ఇస్తే తీసుకుంటారు. తప్పేం లేదు.. ఇప్పుడు కేసీఆర్ గారు నాకు రైతు బంధు ఇచ్చారు.. తీసుకున్నా.. కోటీశ్వరులు కదా.. ఎందుకు తీసుకుంటారు త్యాగం చేయొచ్చు కదా అని అంటారు. కానీ.. చేయాల్సి వచ్చినప్పుడు తీసుకున్నదానికి నాలుగు రెట్లు తిరిగి ఇచ్చేస్తాం’. జగన్ ఇచ్చే ఫ్రీ పథకాలు బాగాలేదని, గతంలో చంద్రబాబు, ఇప్పుడు కెసీఆర్, అటు కర్ణాటకలో కూడా ఇస్తున్నారని .. ఇది సరైనది కాదని, ఇది తన అభిప్రాయమేనన్నారు. ఏపీ విడిపోయిన తర్వాత సంతృప్తికరంగా ఉందా అంటే.. లేదన్నారు. అక్కడ అభివృద్ధి లేదన్నారు.
బొత్స సత్యనారాయణ తనకు సోదరుడని, తనకు ఇష్టమైన రాజకీయ నాయకుడని తెలిపారు. బీఆర్ఎస్ నుండి అవకాశం వస్తే ఆలోచిస్తానని అన్నారు. తన కుటుంబానికి న్యాయం చేయగల్గుతానా, ప్రజలకు సేవ చేయాలనా అని ఆలోచిస్తానన్నారు. బీఆర్ఎస్ ను పొగుడుతుండటంపై జాఫర్ ప్రశ్నించగా.. మంచి పనులు చేస్తే పొగుడుతున్నానని అన్నారు. ఈ నేపథ్యంలో జాఫర్, బండ్ల గణేష్ మధ్య వాగ్వాదం నెలకొంది. పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళతారా అంటే ఆయన గొప్ప స్థాయిలో ఉన్నారని, తన అవసరం ఏముందని అన్నారు. తాను ముఖ్యమంత్రి కావాలని ఏపీ సిఎం కావాలని ఉందన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎవరొస్తారో చెప్పలేనన్నారు. పవన్ కళ్యాణ్‌కి బండ్ల గణేష్ మధ్య దూరం పెరగడానికి మధ్యలో త్రివిక్రమ్ అడ్డుగా ఉన్నారనే వార్తల నేపథ్యంలో తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది. ‘మన దేవుడు మంచివాడు. కానీ డాలర్ శేషాద్రితోనే ప్రాబ్లం ఏం చేద్దాం బ్రదర్ ………!‘ అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు. త్రివిక్రమ్‌ని ఉద్ధేశించే బండ్ల గణేష్ ఆ ట్వీట్ చేసి ఉంటారని కామెంట్లలో చర్చ నడిచింది.
మన దేవుడు మంచివాడు. కానీ డాలర్ శేషాద్రితోనే ప్రాబ్లం ఏం చేద్దాం బ్రదర్ ………! https://t.co/QwK0vGQlcZ
— BANDLA GANESH. (@ganeshbandla) March 18, 2023