Telangana Politics : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు లేరని అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటారు మంత్రి కేటీఆర్. ఎన్ని గొడవలు ఉన్నా వాటిని మర్చిపోయి ప్రత్యర్థి పార్టీ వాళ్లను ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. నిన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కేటీఆర్ కలిశారు. ‘అన్నా.. బాగున్నావా? అంటూ ఆప్యాయంగా పలికరించారు. హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినందుకు ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. అంతేకాదు! బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్‌లను కూడా కేటీఆర్ పలకరించారు. వారి సీట్ల దగ్గరకు నేరుగా వెళ్లి మాట్లాడారు. ఆ తర్వాత కాంగ్రెస్, ఎంఐఎం, సొంతపార్టీ ఎమ్మెల్యేలకు అభివాదం చేశారు. కేటీఆర్ బీజేపీ ఎమ్మెల్యేలను పలకరించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.