సీఎం కేసీఆర్ నారాయణ ఖేడ్ పర్యటనలో భాగంగా జరిగిన సభలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను సీఎం తన ప్రక్కన సీటులో కూర్చోబెట్టుకున్నారు. సభలో మంత్రి హారీష్ రావు ఆ మహిళ గురించి ప్రస్తావించగా ముఖ్యమంత్రి కేసీఆర్ సభ వేదికపైకి పిలిపించారు. తన ప్రక్క సీట్లో కూర్చోపెట్టుకున్న సీఎం ఆ మహిళ చెప్పే విషయాలు విన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ మారింది. దీంతో అందరిలో ఆ మహిళ ఎవరు? అనే ఆసక్తి నెలకొంది.
నారాయణ్ ఖేడ్ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రస్తావించిన మహిళ పేరు.. చిమ్నీబాయి. కంగ్టి మండలం సర్ధార్ తండాకు చెందిన చిమ్నీబాయి గత నారాయణ్ ఖేడ్ ఉపఎన్నికల సందర్భంగా తండాకు వచ్చిన మంత్రి హరీష్ రావుకి తమ సమస్యలు తెలిపింది. అనంతరం తండాలో జరిగిన అభివృద్ధి పనుల గురించి ఈ సభలో మంత్రి ప్రస్తావించారు. ఆ సందర్భంలో చిమ్నీబాయి పేరు ప్రస్తావించారు. సీఎం కేసీఆర్ తండాలో జరిగిన అభివృద్ధి పనుల గురించి చిమ్నీబాయిని అడిగి తెలుకున్నారు. ఇంకా ఏమైన సమస్యలు ఉన్నాయా..అని సీఎం సార్ అడిగినట్లు ఆమె తెలిపింది. సీఎం సార్ పక్కన కూర్చోవడం పట్ల చిమ్నీబాయి ఆనందం వ్యక్తం చేసింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.