ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రైతులకు ఒక మంచి శుభవార్త చెప్పారు. యాసంగిలో పండించిన ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయబోతున్నట్లుగా ఆయన రైతులకు తెలిపారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రైతులు కష్టాలు పడుతున్నారు.. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దీని వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం వస్తుందన్న విషయం నిపుణులతో కమిటీ కూడా వేయబోతున్నట్టు తెలిపారు.
రైతుల వద్ద నుంచి దాన్యం కొనుగోలు తో పాటు దాన్ని డిస్పోజ్ చేసేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దానిపై కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అయితే రైతుల వద్ద నుంచి దాన్యం కొనుగోలు చేసేందుకు ఆయా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేస్తామని త్వరలో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.