ధనం మూలం ఇదం జగత్.. ఈ కాలంలో డబ్బు అంటే ఎవరికి చేదు.. ఆ డబ్బు కోసం కొంత మంది ఎన్నో అడ్డదారుల్లో నడుస్తున్నారు. ఈజీ మనీ కోసం చేయరాని పనులు చేస్తున్నారు.. ఎదుటి వారిని ఈజీగా బోల్తా కొట్టిస్తున్నారు. కానీ కొంత మంది నిజాయితీ పరులు కూడా ఉన్నారు.. అలాంటి అప్పుడప్పుడు తారస పడుతుంటారు. సైకిల్ రిక్షాలు, ఆటోలు, కార్లు నడిపే వారు కొన్ని సార్లు కస్టమర్లు మర్చిపోయిన బ్యాగు, డబ్బు ఇతర సామాన్లు యజమానికి ఫోన్ చేసి మరీ ఇచ్చేస్తుంటారు. మరికొంత మంది పోలీస్ స్టేషన్ కి వెళ్లి తమ అడ్రస్ చెప్పి మరీ ఆ వస్తువు యజమానికి చేరేలా చేయమని చెబుతుంటారు.తాజాగా హైదరాబాద్ లో ఓ ఆటోడ్రైవర్ నిజాయితీకి ప్రయాణికురాలు అభినందనలు తెలిపారు. వివరాల్లోకి వెళితే..
లంగర్ హౌస్ కి చెందిన మీర్జా సుల్తాన్ బేగ్ హషమ్‌నగర్ నుండి టోలీచౌకి వైపు బైక్‌పై వెళ్తుండగా, దారిలో రేతిబౌలి సమీపంలోకి రాగా వారి హ్యాండ్ బ్యాగ్ కనిపించకుండా పోయిందని గుర్తించారు. ఒక్కసారే షాక్ తిన్న ఆమె తన హ్యాండ్ బ్యాగ్ మిస్ అయ్యిందని.. అందులో బంగారు ఆభరణాలను ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆభరణాల జాడ కోసం సీసీ కెమెరాలను తనిఖీ చేశారు.
ఇది చదవండి: వారి ఖాతాల్లో పదివేలు జమచేసిన ప్రభుత్వం
ఆటోడ్రైవర్ సయ్యద్ జాకర్ లంగర్ హౌస్ పిల్లర్ నంబర్ 55 దగ్గర హ్యాండ్ బ్యాగ్‌ను గుర్తించి బ్యాగ్‌ను తెరిచి చూడగా ఒక్క బిల్లు రశీదుతోపాటు బంగారు ఆభరణాలు కనిపించాయి. వెంటనే బాధితురాలి ఫోన్ నంబర్‌కు కాల్ చేసి సుమారు 10 తులాల బంగారు ఆభరణాలతో పాటు బ్యాగ్ ను లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఎలాంటి దురాలోచన చేయకుండా ఎంతో నిజాయితీతో బ్యాగ్ ని అప్పగించిన ఆటో డ్రైవర్ సయ్యద్ జాకర్ బాధిత మహిళతో పాటు పోలీసులు అభినందించారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.