తెలంగాణ గవర్నర్ తమిళిసైకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయం కుదరడం లేదు. ఈ క్రమంలో టీఆర్ఎస్ మిత్ర పార్టీ, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సభ్యుడిని గవర్నర్ పీఆర్వోగా పెట్టుకోవడం చాలా అక్రమమని అన్నారు. ఈ వ్యవహారంతో.. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ చేస్తున్న ఫిర్యాదులు రాజకీయంగా చాలా అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు.
అయితే,.. గవర్నర్ తమిళిసైకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ప్రోటోకాల్‌కు సంబంధించిన వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయంలో గవర్నర్ కేంద్రానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడం కష్టమంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. సీఎం కేసీఆర్ గవర్నర్‌తో వ్యహరిస్తున్న తీరును బీజేపీ తప్పుపడుతోంది.
@DrTamilisaiGuv Excellency the Governor is a titular head and appointing a bjp party member as your Public relations officer is a case of impropriety ,it also raises doubts about your complaints with regards to @TelanganaCMO https://t.co/mihPZBXrcX
— Asaduddin Owaisi (@asadowaisi) April 22, 2022
ఇది కూడా చదవండి: కలెక్టర్ ఫోటోతో డబ్బులు కావాలంటూ మెసేజ్ లు..! తొందరపడ్డ ప్రభుత్వ డాక్టర్!
మరోవైపు.. ఖమ్మం జిల్లాలో సామినేని సాయిగణేశ్, కామారెడ్డి జిల్లాలో తల్లీకొడుకుల ఆత్మహత్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. భాజపా నేతలు సమర్పించిన పలు మీడియా, సోషల్ మీడియా కథనాలు, వినతి పత్రాలపై స్పందించిన గవర్నర్ ఈ ఆదేశాలు జరీ చేశారు.