ఇటీవల కేఏ పాల్ తెలంగాణపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ప్రజాశాంతి పార్టీ ఏర్పాటు చేసిన ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా అపజయం పాలయ్యారు. ప్రస్తుతం ఆయన తెలంగాణలో పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో పర్యటిస్తున్న ఆయనపై దాడి జరిగింది. తనపై టీఆర్ఎస్ కార్యకర్త కావాలనే దాడి చేశాడని.. డిజీపీకి ఫిర్యాదు చేసేందుకు పాల్ వెళ్తున్న నేపథ్యంలోనే ఆయనను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా త్వరలో పాదయాత్ర చేపడతానని కేఏ పాల్ తెలిపారు.
తనపై ఎన్నిసార్లు దాడి చేసినా రెడీగా ఉంటాను.. అధికార పార్టీకి చెందిన కార్యకర్త దాడి చేసిన విషయం అందిరకీ తెలిసిందే. అయినా కూడా అతనిపై ఎలాంటి చర్యలు లేవు. తాను మళ్లీ సిరిసిల్లకు వెళ్తా అన్నారు. తనపై దాడి చేసిన టీఆర్ఎస్ నేతపై కేసు పెట్టేందుకు వెళ్తుంటే తనను గృహ నిర్భందం చేశారని.. బుధవారం తాను డీజీపీని కలుస్తానని పాల్ చెప్పారు. ఇదిలా ఉంటే.. బస్వాపూర్ గ్రామ రైతులు నిన్న పాల్‌ను హైదరాబాద్‌లో కలిశారని.. తనకు వారి కష్టాలు విన్నవించుకున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణలో పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం ఖచ్చితంగా మూడు లక్షల పరిహారం ఇవ్వాలని.. అది కూడా ఐదు రోజుల్లోనే అందించాలని ఆయన సర్కాన్ ని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం తనకు ఆ నష్ట పరిహారం ఇవ్వమని చెప్పినా పరవాలేదు అన్నారు. రోవైపు పాల్‌పై దాడి సంఘటన విషయంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.