ఈ మద్య చిన్న సినిమాలు పెద్ద హిట్ అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టేలా ‘బలగం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు వేణు. కమెడియన్ గా తన సత్తా చాటిన వేణు డైరెక్టర్ గా రూపొందించిన చిత్రం ‘బలం’. ఈ చిత్రాన్ని చూసి సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఫిదా అయ్యారు.
తెలుగు బుల్లితెర జబర్ధస్త్ లో తన సత్తా చాటి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వేణు యెల్దండి అనూహ్యంగా దర్శకుడిగా మారారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టేలా ‘బలగం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రాన్ని చూసి సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఫిదా అయ్యారు. పిట్ట ముట్టుడు కాన్సెప్ట్ తో కుటుంబాల మద్య ఉండే అనుబంధాల గురించి ఎంతో గొప్పగా చూపించాడు. ఈ మద్యనే ఈ చిత్రంప ప్రశంసలు కురిపిస్తూ మెగాస్టార్ చిరంజీవి వేణుతో పాటు చిత్ర యూనిట్ సభ్యులను సత్కరించారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ‘బలగం’సినిమాకు ఫిదా అయ్యారు.
తెలంగాణ సంస్కృతి.. మనుషుల మద్య ఉన్న చిన్న చిన్న గొడవలు.. అనురాగాలు, ఆప్యాయతలు చూపిస్తూ బలగం చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన డైరెక్టర్ వేణు యెల్దండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అభినందించారు. అంతేకాదు ఈ చిత్రం గురించి అందరూ ఎంతో గొప్పగా చెప్పారని.. ‘బలగం’ సినిమా తాను చూసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వేణుని సిరిసిల్ల కలెక్టరేట్ ఆఫీస్ కి పిలిపించి మంత్రి కేటీఆర్ ఘనంగా సత్కరించారు. తెలంగాణ యాస.. నేటివిటీకి సంబంధించిన చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుందని.. గతంలో వచ్చిన సినిమాలు కూడా ఇక్కడి వాళ్లు ఎంతో గొప్పగా ఆదరిస్తారని అన్నారు.
ఇక ముందు ఇలాంటి మంచి సబ్జెక్ట్ తీసుకొని చిత్రాలు తెరకెక్కించాలని.. ఇప్పుడప్పుడే కమర్షియల్ చిత్రాల వైపు వెళ్లవద్దని వేణుకి మంత్రి కేటీఆర్ సూచించారు. మంచి సినిమాలు తీస్తే ఏ భాషవారైనా.. ఏ ప్రాంతం వారైనా ఆదరిస్తారని అన్నారు. తాను గ్రాండ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైనపుడు ఈ సినిమా అందరి మనసు గెలుస్తుందని వేణు కాన్ఫిడెంట్ గా చెప్పాడని.. అది ఇప్పుడు నిజమైందని అన్నారు. తన నియోజకవర్గమైన సిరిసిల్లకు చెందిన వేణు సిరిసిల్ల ఖ్యాతిని పెంచాడని అభినందించారు. తెలంగాణ నేటీవిటీకి సంబంధించిన చిత్రాలకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని, వేణు మంచి డైరెక్టర్ గా ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ తో పాటు ఎమ్మెల్యేలు సిహెచ్ రమేష్ బాబు, రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి వేణు యెల్దండి కి అభినందనలు తెలిపారు.