కామారెడ్డి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఆనారోగ్యంతో తల్లి మరణించడంతో కూతురు పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని పరీక్షకు హాజరైంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికులను కన్నీరు పెట్టించింది. అసలు ఏం జరిగిందంటే? కామారెడ్డి జిల్లా బిచ్కుంద గ్రామంలో గంగమణి అనే మహిళ గత కొన్ని రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉంది.
అయితే ఇటీవల గంగమణికి ఓ ఆస్పత్రిలో చికిత్స కూడా అందించారు. కానీ ఆమె ఆరోగ్యం సహకరించకపోవడంతో శుక్రవారం చికిత్స పొందుతూ మరణించింది. ఇక మరో విషయం ఏంటంటే? కూతురికి అదే రోజు ఇంటర్ చివరి పరీక్ష ఉండడం విశేషం. దీంతో తల్లి చనిపోయిందన్న బాధ ఒక వైపు.. రాయాల్సిన పరీక్ష మరో వైపు. కానీ కూతురు మాత్రం కనిపెంచిన తల్లి కన్న పరీక్ష ముఖ్యం కాదనుకుని నిరాకరించింది.
ఇది కూాడా చదవండి: Fined For Crying: మరీ ఇంత దారుణమా.. ఏడ్చినందుకు యువతికి ఫైన్!
దీంతో బంధువులు ధైర్యం నూరిపోయడంతో ఆ బాలిక పుట్టెడు దుఖంలో పరీక్షలు రాయటానికి వెళ్లింది. కాగా పొంగుకొస్తున్న దుఖాన్ని దిగమింగుకుంటూ ఆమె కూతురు పరీక్ష రాయడం విశేషం. ఇంట్లో తల్లి శవాన్ని పెట్టుకుని ఆ బాలిక పరీక్షలు రాస్తుండడంతో ఈ సీన్ ను చూస్తున్న తోటి విద్యార్థులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. ఇక పరీక్షలు రాసిన అనంతరం ఆ బాలిక తల్లి అంత్యక్రియల్లో పాల్గొంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికులను కన్నీటి సంద్రంలోకి నెట్టేసింది. ఈ హృదయవిదారక ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.