ఇటీవల కాలంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అలానే వాహనాలను రివర్స్ చేస్తుండగా కూడా ఘోరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు నిర్లక్ష్యంగా వాహనాలను రివర్స్ చేస్తూ పసిపిల్లల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.
ఇటీవల కాలంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అలానే వాహనాలను రివర్స్ చేస్తుండగా కూడా ఘోరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు వాహనాలను రివర్స్ చేస్తున్న సమయంలో సరిగ్గా చూడక పసిపిల్లలపైకి ఎక్కి చేసి..వారి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలో ఇస్రోజివాడిలో విషాదం చోటుచేసుకుంది. కారు కిందపడి 13 నెలల బాలుడు మృతి చెందాడు. కారును రివర్స్ చేస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.
కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడిలో తన ఇంటి బయట ఆడుకుంటున్న 13 నెలల బాలుడిపైకి కారు దూసుకెళ్లింది. బాలుడు ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో అతడి పెద్దనాన్న కారును రివర్స్ చేశాడు. ఆ కారు టైర్ కింద పడి ఆ పసిబాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిని ఢీకొట్టిన కారుపై ఓవర్ స్పీడ్, డెంజరస్ డ్రైవింగ్ కింద చలనాలు ఉన్నట్లు తెలుస్తుంది. కరీంనగర్ లో తరహాలోనే తమిళనాడులోని ఈరోడ్ కూడ ఓ ఘటన చోటుచేసుకుంది.
తమిళనాడులోని ఈ రోడ్డులో కారు రివర్స్ చేస్తుండగా ఇద్దరు పిల్లలను ఢీకొట్టింది. ఈప్రమాదంలో తనీష్ అనే బాలుడు మృతిచెందాడు. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుడి మేనమామ కారును రివర్స్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం ఆస్పత్రి ప్రాంగణంలో జరగడంతో అందరు భయాందోళనకు గురయ్యారు. ఇటీవల కొంతకాలం నుంచి కార్లు రివర్స్ చేస్తుండగా పిల్లలను ఢీకొట్టిన ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో అభంశుభం తెలియని పసిపిల్లలుఅశువులు బాస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈ బాలుడు ఘటన చోటుచేసుకుంది. చిన్న చిన్న తప్పిదాలే ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. కొద్దిపాటి నిర్లక్ష్యాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా జరిగిన ఈ రెండు ఘోర ప్రమాదాలు జరిగిన ప్రాంతాల్లు వెరైనా తీరు మాత్రం ఒకటి. కారు గేరు రివర్స్ చేయడం ఆ ఇద్దరి బాలురి పాలిట మృత్యువుగా మారింది. ముఖ్యంగా నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఇలాంటి ఘోరాలు జరిగి.. ఎందరో తల్లులకు కడుపుకోత మిగులుతుంది. మరి.. ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.