మహబూబ్ నగర్ జిల్లాలో గత రెండు రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో జిల్లాలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ క్రమంలో కోడురు దగ్గర మన్యం కొండ రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర భారీగా వరదనీరు చేరింది. ఈ క్రమంలో అంటుగా 30 విద్యార్ధులతో వెళ్తున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సు వరద నీటిలో చిక్కుకుంది. దీంతో పెద్ద ఎత్తున పిల్లలు కేకలు వేయడంతో స్థానికలు అక్కడికి చేరుకుని బస్సులోని విద్యార్థులను రక్షించారు.
అయితే వరద నీటి నుండి బస్సు వెళ్తుందని భావించిన డ్రైవర్ బస్సును ముందుకు పోనిచినట్లుందని తెలుస్తోంది. ఈక్రమంలో వరద నీటిలోకి మధ్యలోకి వెళ్లిన కొద్దిసేపటికే బస్సు ఇంజన్ ఆగిపోయింది. దీంతో బస్సులో ఉన్న విద్యార్ధులు కేకలు వేశారు.ఈ కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వరద నీటిలోకి దిగి బస్సులో ఉన్న విద్యార్ధులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. బస్సులో ఎల్ కే జీ నుండి ఐదో తరగతి విద్యార్ధులున్నారు. బస్సు కిటీకీ వరకు వరద నీరు చేరడంతో బస్సు వరద నీటిలోనే మునిగిపోయింది. బస్సు ఇంకాస్తా ముందుకు వెళ్లి ఉంటూ పూర్తిగా నీటిలో మునిగి పెద్ద ప్రమాదం సంభవించి ఉండేదని, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.