మరో మేకిన్ ఇండియా వ్యాక్సిన్ చిన్నారులకు సైతం వ్యాక్సిన్ అందుబాటులో వస్తోంది. సూది లేకుండా ఇంట్రాడెర్మల్ ప్లాస్మిడ్ డీఎన్‌రే వ్యాక్సిన్ కావడంతో యాంటీబాడీలు ఎక్కువ కాలం శరీరంలో ఉంటాయని సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువేనని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. 12 ఏళ్లు పైబడినవారిపై కూడా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడంతో చిన్నారులకు సైతం అందుబాటులో వచ్చిన తొలి వ్యాక్సిన్‌గా నిలిచింది. మిగతా వాటికి భిన్నంగా మూడు డోసుల ఈ టీకాను 12 ఏళ్లు దాటిన చిన్నారులకు ఇవ్వవచ్చు. ఈ వయసువారికి దేశంలో అందుబాటులోకి వచ్చిన తొలి కొవిడ్ టీకా ఇదే కావడం విశేషం.
మేకిన్ ఇండియా వ్యాక్సిన్ జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్ డి వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతిచ్చింది.సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ మూడు డోసుల జైకోవ్ డి వ్యాక్సిన్‌కు ఆమోదానికి సిఫారసు చేయడంతో డీసీజీఐ (DCGI) అనుమతి లభించింది. ఇది రెండవ మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కావడం ఓ ప్రత్యైకత. చిన్నారులకు అంటే 12 ఏళ్లు దాటినవారికి కూడా అందుబాటులో వచ్చిన తొలి వ్యాక్సిన్ ఇదే.
జైకోవ్–డి టీకా అత్యవసర వినియోగ అనుమతుల కోసం గత నెల ఒకటిన దరఖాస్తు చేసుకున్నట్టు జైడస్ క్యాడిలా సంస్థ వెల్లడించింది. పెద్దల్లోనే కాకుండా 12 –18 ఏళ్లవారికి కూడా తమ టీకా సురక్షితమని ప్రకటించింది. అనుమతులు వచ్చాక రెండు నెలల్లోనే టీకాను మార్కెట్లోకి తెచ్చేలా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిపింది. ఏడాదికి 120 మిలియన్ డోసుల్ని ఉత్పత్తి చేయాలనేది కంపెనీ లక్ష్యంగా ఉంది.