ఈ మద్య ప్రమాదాలు ఏ రూపంలో ఎపుడు ఎలా వస్తాయో ఎవరూ ఊహించలేకపోతున్నారు. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిన వారు అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడం.. కన్నుమూయడం లాంటివి ఘటనలు తరుచూ జరుగుతూ ఉన్నాయి. కొన్నిసార్లు శుభకార్యాలు, ఉత్సవాల్లో కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల ఎంతో మంది అస్వస్థతకు గురి అవుతుంటారు.
ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో ఊహించడం కష్టం.. అప్పటి వరకు మనతో ఆడుతూ.. పాడుతూ ఉన్నవాళ్లు అకస్మాత్తుగా అస్వస్థతకు గురి అవుతున్న సంఘటనలు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ చూస్తూనే ఉన్నాం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో బాగ్‌పత్‌లోని ఒక దేవాలయంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. కిచిడీ తిని కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బాగ్‌పత్‌లోని నినానా గ్రామంలో అమ్మావారి దేవాయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎంతో మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చి వసంత నవరాత్రి ఉత్సవంలో పాల్గొన్నారు. అప్పటి వరకు అక్కడి వాతావరణం ఎంతో కోలాహలంగా ఉంది. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదాల రూపంలో కిచిడీ వడ్డించారు. ఆ కిచిడీ తిన్న కొద్దిసేపటి తర్వాత పెద్దలు పిల్లలు వాంతులు చేసుకోవడం మొదలు పెట్టారు. కొంతమంది స్పృహ కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య బృందం అక్కడికి చేరుకొని పరిస్థితి సీరియస్ గా ఉన్నవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎస్‌కే చౌదరి మాట్లాడుతూ.. దేవాలయంలో కిచిడీ తిన్న తర్వాత డజన్ల కొద్ది జనాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. కొంతమందికి అక్కడే ట్రీట్ మెంట్ చేయగా.. తీవ్రంగా ఇబ్బంది పడుతున్నవారందరిని స్థానిక ఆసుపత్రికి తరలించామని.. ఇందులో ముగ్గురు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని.. మిగతా పిల్లు, పెద్దలు అంతా క్షేమంగానే ఉన్నారని అన్నారు. ప్రస్తుతం పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారిని చూసుకునేందుకు ఇద్దరు పిల్లల డాక్టర్లను ఉంచామని తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని ఆయన అన్నారు. ఇటీవల హాస్టల్స్, స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ అయి ఎంతో మంది పిల్లలు అనారోగ్యంతో ఆస్పత్రిపాలయ్యారు.. కొన్నిరోట్లు పిల్లలు మరణించిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.