ప్రస్తుతం మీరు ఎన్ని ఫోన్ నెంబర్స్ వాడుతున్నారు? ఒకటి, లేదా రెండు. మహా అయితే బిజినెస్ అవసరాల కోసం ఇంకో నెంబర్ ఎక్స్ట్రా గా ఉంటుంది. నిజానికి మనలో చాలా మంది.. తాము వాడే నెంబర్స్ మాత్రమే.. తమ పేరు మీద ఉండే నెంబర్స్ అని భ్రమ పడుతుంటారు. కానీ.., మనకి తెలియకుండానే మన ప్రూఫ్స్ తో చాలా నెంబర్స్ చలామణి అవుతూ ఉంటాయి. గతంలో మనం కొన్ని నెంబర్స్ వాడి ఉంటాము. కొత్త నెంబర్స్ వచ్చాక వాటి గురించి అస్సలు పట్టించుకోము. అలాగే.., ఎప్పుడో మన స్నేహితులకి, బంధువులకి సిమ్ లు కావాలని మన ప్రూఫ్స్ ఇచ్చి ఉంటాము. వాటిని కూడా అలాగే మర్చిపోయి ఉంటాము. ఇక ఇవన్నీ కాక.., కొన్ని గ్యాంగ్స్ మన ప్రూఫ్స్ ని సాధించి.., వాటి ద్వారా సిమ్స్ తీసుకుని ఆన్లైన్ మోసాలకు పాల్పడుతూ ఉంటాయి. ఒక్కోసారి మన ప్రూఫ్స్ తో ఉన్న ఫోన్ నెంబర్స్ బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఐడెంటిఫై అవుతూ ఉంటాయి. వాటికి కారణం కూడా ఇదే.
ఈ నేపథ్యంలో అసలు మన పేరు మీద మొత్తం ఎన్ని సిమ్స్ ఉన్నాయో తెలుసుకుంటే అన్ని విధాలా మంచిది. మన పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయో తెలుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. నెట్ అందుబాటులో ఉంటే.. కూర్చున్న చోటు నుండే.. 2 నిమిషాల్లో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇందుకు tafcop.dgtelecom.gov.in పోర్టల్ లోకి మన ఫోన్ నెంబర్ తో లాగిన్ అయితే సరిపోద్ది. ఆ తరువాత ఫోన్ కి ఒక ఓటీపీ పిన్ మెసేజ్ వస్తుంది. ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే.., మన పేరు మీద ఉండే మొత్తం ఫోన్ నెంబర్స్ లిస్ట్ వరుసగా వస్తాయి. వాటిలో అవసరం లేని నెంబర్స్ పై రిపోర్ట్ కొట్టి, కావాల్సిన సమాచారాన్ని ఇస్తే.. టెలికాం చర్యలు తీసుకుంటుంది. ఇలా చేయడం ద్వారా.., చాలా ఫ్రాడ్స్ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.సో.., చాలా సింపుల్ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి.