మారుతున్న కాలానికి అనుగుణంగా వాట్సాప్‌లో కొత్త కొత్త ఫీచర్లు. ఇప్పటికే.. వాయిస్ స్టేటస్, స్టేటస్ రియాక్షన్స్, స్టేటస్ ప్రొఫైల్, లింక్ ప్రివ్యూ ఫీచర్స్ వంటి వాటిని పరిచయం చేసిన వాట్సాప్.. మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తేనుంది. అదే.. 'కాల్ షెడ్యూల్ ఫీచర్'.
మారుతున్న కాలానికి అనుగుణంగా వాట్సాప్‌లో కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. వీటి వల్ల యూజర్లకు కలిగే అదనపు ప్రయోజనాలేమో కానీ, ఏయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయన్నది మాత్రం పెద్ద కన్ఫ్యూజ్. ఇప్పటికే స్టేటస్ లో ఆడియో మెసేజులు,అన్ నోన్ నంబర్లను బ్లాక్ చేయడానికి షార్ట్ కట్, గ్రూప్ కాలింగ్ ఫీచర్, సొంత నంబర్లకు మెసేజెస్ పంపుకునే వెసులుబాటు.. ఇలా ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్.. తాజాగా, మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తేనుంది. అదే.. ‘కాల్ షెడ్యూల్ ఫీచర్‘.
ఈ ఫీచర్ ద్వారా యూజర్లు వాట్సాప్‌లో ఆడియో, వీడియో కాల్స్‌ను షెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే.. వాట్సాప్ గ్రూప్‌లోని సభ్యులకు ఎప్పుడు ఆడియో/ వీడియో కాల్ వెళ్లాలో ముందుగానే సెట్ చేసుకోవచ్చన్నమాట. ఇప్పటివరకు కాల్ షెడ్యూల్ ఫీచర్ అనేది.. జూమ్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి ప్లాట్ ఫామ్స్ లలో అందుబాటులో ఉంది. ఇకపై వాట్సాప్ లోనూ కాల్స్ షెడ్యూల్ చేసుకోవచ్చు. వాట్సాప్ వేదికగా ఆన్ లైన్ మీటింగులు నిర్వహించే వారికి ఈ సరికొత్త ఫీచర్ బాగా ఉపయోగపడనుంది.
ముందుగా వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి.. వీడియో/ఆడియో కాల్ ఐకాన్‌పై క్లిక్ చేయగానే షెడ్యూల్ కాల్ అని పాప్-అప్ విండో డిస్ ప్లే అవుతుంది. అందులో నిర్వహించాలనుకున్నా మీటింగ్ పేరు, తేదీ, సమయం లాంటి వివరాలను ఎంటర్ చేయాలి. ఈ వివరాలన్నీ నమోదు చేశాక క్రియేట్ పై క్లిక్ చేస్తే కాల్ షెడ్యూల్ అవుతుంది. అనంతరం కాల్ ప్రారంభమైన వెంటనే గ్రూపు సభ్యులందరికీ అలర్ట్ నోటిఫికేషన్ వెళుతుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే బీటా యూజర్లకు అందుబాటులోకి తేనున్నారు. అలాగే.. వాట్సాప్, ‘వాయిస్ to టెక్స్ట్‘ అనే ఫీచర్ పై కూడా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ ద్వారా వాయిస్ మెసేజ్ వినలేని యూజర్లు సదరు ఆడియోను ప్లే చేయగానే అందులో ఉన్న సమచారం టెక్ట్స్ రూపంలో స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది.
#whatsapp is working on schedule call feature.
Users will be able to choose a title, date, and time for their call, ensuring that everyone in the group is aware of when it will take place.
Via: @WABetaInfo #schedulecall #feature pic.twitter.com/skOx5Zpnfv
— Techassist (@tcassist3) February 8, 2023