ఒకప్పుడు మొబైల్ ఫోన్ అంటే కాల్స్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టెక్నాలజీ రాకతో మొబైల్ కంపెనీలు స్మార్ట్ఫోన్లను ఆకర్షణీయంగా మార్చేశాయి. అంతటితో ఆగిందా అంటే లేదు.. డిస్ ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ.. ఇలా ఏదో ఒక దానిలో కొత్త ఫీచర్లు జోడిస్తూ స్మార్ట్ ఫోన్లలో అద్భుతాలు చేస్తున్నాయి. తాజాగా వివో సంస్థ సరికొత్త కెమెరాను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. ఏకంగా సెల్ ఫోన్ కెమెరాలో డ్రోన్ కెమెరా పెట్టేసింది. దీనికి సంబందించి డిజైన్.. టెస్టింగ్ కూడా పూర్తయింది. కాన్సెప్ట్ వీడియోను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది.
ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ కెమెరాను ఫోన్ కింది భాగంలో అమర్చనున్నట్లు తెలుస్తోంది. మన అవసరం మేరకు ఈ కెమెరాను తొలగించి డ్రోన్ తరహాలో గాల్లోకి ఎగరేయవచ్చు. వివో డ్రోన్ కెమెరాలో మొత్తం నాలుగు ప్రొపెల్లర్లు, ప్రత్యేక బ్యాటరీ, రెండు కెమెరాలు, రెండు ఇన్ఫ్రారెడ్ సెన్సార్లను అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ 200 మెగా పిక్సెల్ కెమెరాతో రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్‌ను ఎప్పుడు ఇండియాలో మార్కెట్లోకి విడుదల చేస్తారో ఇంకా వివో స్పష్టం చేయలేదు. ప్రస్తుతం డిజైన్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
The camera in this concept phone from Vivo is placed on top of the drone; this makes it very easy to take selfies or zoom in…
— Tansu YEĞEN (@TansuYegen) July 25, 2022
ఈ డ్రోన్ డిజిటల్ కెమెరాతో ఆకాశంలో చిత్రాలను తీయవచ్చని, సినిమాలను చిత్రీకరించడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని వివో సంస్థ పేర్కొంది. కాగా, డ్రోన్ కెమెరా పేటెంట్ హక్కుల కోసం వివో 2020 డిసెంబర్‌లో వరల్డ్ మెంటల్ ప్రాపర్టీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. ఈ విషయాన్ని వివో అధికారిక వెబ్సైట్ ధ్రువీకరించింది. ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉన్న ఈ కెమెరా ఫీచర్.. భవిష్యత్తులో వివోను అందనంత ఎత్తులో నిలబెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.వివో తీసుకొస్తున్న డ్రోన్ కెమెరా ఫీచర్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Vivo patents a smartphone with a camera mini drone inside. pic.twitter.com/tkygimJ0BH
— sʜᴀʜᴢᴀᴅ – ᴘʜᴀʀᴍᴀ (@arian290360) July 14, 2021