అతి పెద్ద జనాభా గల దేశాల్లో ఇండియా స్థానం.. రెండోది. ఇంత జనాభా గల మనదేశ మొబైల్ మార్కెట్ లోకి రోజుకో స్మార్ట్‌ఫోన్ వచ్చి చేరడం సహజం. కాకుంటే.. అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటేనే.. మొబైల్ ప్రియులు అట్ట్రాక్ట్ అవుతారు. ఇప్పటివరకూ కెమెరా, ప్రాసెసర్, ర్యామ్, ఎక్సటర్నల్ స్టోరేజ్.. వంటి అధునాతన ఫీచర్స్ తో మొబైల్ ప్రియులను ఆకట్టుకుంటున్న టెక్ కంపెనీలు.. ఇప్పుడు బ్యాటరీ సామర్త్యంపై కన్నేశాయి. తాజాగా.. డాగీ టెక్ కంపెనీ 12,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్త్యంతో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ధర: డాగీ ఎస్89 ప్రో.. ధర $239.99 డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 19 వేలు). అయితే.. ఈ ధర జూలై 29 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత ఫోన్ ధర దాదాపు $700 డాలర్లు (రూ. 55 వేలు)గా ఉంటుందని కంపెనీ పేర్కొంది. జూలై 25 నుండి AliExpress లో అందుబాటులో ఉండనుంది. స్పెసిఫికేషన్స్: 6.3 అంగుళాల ఎల్సీడీ + ఫుల్ హెచ్డీ డిస్ప్లే మీడియాటెక్ హీలియో పీ90 చిప్ 8జీబీ ర్యామ్, 256జీబీ ఎక్సటర్నల్ స్టోరేజ్ 64 ఎంపీ + 20ఎంపీ+ 8 ఎంపీ.. బ్యాక్ కెమెరా 16ఎంపీ ఫ్రంట్ కెమెరా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ 12,000mAh బ్యాటరీ, 65W వైర్డ్ ఛార్జింగ్,15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ 12,000mAh పవర్ ఫుల్ బ్యాటరీతో రానున్న ఈ స్మార్ట్ ఫోన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Introducing the Doogee S89 Pro. A real powerhouse beast of a rugged smartphone, crafted with a rear multi-color breathing light, powered by a 12,000 mAh battery capacity and a 65W super lightening fast charger⚡. #DoogeeS89Pro pic.twitter.com/em4UFXObqf — DOOGEE (@DOOGEE_official) July 16, 2022 ఇదీ చదవండి: Amazon Prime Day Sale: అమెజాన్ లో కళ్లు చెదిరే ఆఫర్స్.. మొబైల్స్‌పై భారీ తగ్గింపు! ఇదీ చదవండి: Smartwatch: ఫైర్ బోల్ట్ స్మార్ట్‌వాచ్ పై భారీ తగ్గింపు.. ఏకంగా 13వేలు డిస్కౌంట్..!