ఎలక్ట్రిక్ వాహనం ఇంట్లో ఛార్జింగ్ పెడితే 4,5 గంటలు పడుతుంది. అదే ఛార్జింగ్ స్టేషన్లో అయితే గంట నుంచి గంటన్నర పడుతుంది. దీని వల్ల యజమానికి చాలా సమయం వృధా అవుతుంది. ప్రయాణ సమయం కూడా వృధా అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా కేవలం 10 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయ్యేలా ప్రముఖ కంపెనీ సరికొత్త టెక్నాలజీని రూపొందిస్తుంది. ఇది కనుక మార్కెట్లో వస్తే కార్ల యజమానులకు నిజంగా పండగే.
బైక్, కారు వంటి ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు ఛార్జింగ్ పెడితే ఫుల్ అవ్వడానికి కనీసం 4,5 గంటల సమయం పడుతుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు కొనుక్కున్న వారి పరిస్థితి అయితే మరీ దారుణం. పర్యావరణం మీద ప్రేమతో ఎలక్ట్రిక్ కార్లు కొనుక్కున్నా గానీ సంతృప్తి అనేది ఉండడం లేదు. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈవీ కారు ఫుల్ ఛార్జ్ చేస్తే 400 నుంచి 500 కి.మీ. రేంజ్ ఇస్తుంది. 500 కి.మీ. దాటి ఏదైనా ఊరు వెళ్తే మధ్యలో ఎక్కడైనా ఛార్జింగ్ స్టేషన్ ఉంటే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నా గానీ కనీసం గంటన్న నుంచి గంటన్నర ఎదురు చూడాల్సి వస్తుంది. దీని వల్ల కొన్నవారికి నిరుత్సాహం కలుగుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రముఖ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది.
జపాన్ కి చెందిన టొయోటా కార్ల కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల కోసం సాలిడ్ స్టేట్ బ్యాటరీని తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సమయాన్ని 10 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయానికి తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని కంపెనీ ప్రకటించింది. సాధారణంగా ఈవీ యజమానులు ఇళ్ళ దగ్గర రాత్రి సమయంలో ఛార్జింగ్ పెట్టుకుంటారు. దీని కోసం 4,5 గంటలు నిద్ర మానుకుని గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఓవర్ ఛార్జ్ అయితే పేలిపోతుందేమో అన్న భయం. అందుకే కేవలం 10 నిముషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలోనే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయ్యేలా సరికొత్త టెక్నాలజీతో బ్యాటరీలను తయారు చేస్తుంది. అంతేకాదు 10 నిమిషాలు ఛార్జింగ్ పెడితే 1000 కి.మీ. రేంజ్ ఇచ్చేలా బ్యాటరీని సిద్ధం చేస్తుంది.
దీని వల్ల దూర ప్రాంతాలకు ప్రయాణ సమయం వృధా కాకుండా వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీతో హైబ్రిడ్ కార్లను టొయోటా కంపెనీ తీసుకొస్తున్నట్లు చెబుతుంది. 2022లో సాలిడ్ స్టేట్ బ్యాటరీతో వస్తున్నట్లు 2017లో ప్రకటించింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల జాప్యం జరిగింది. ఇప్పుడు మరోసారి ముందుకొచ్చి ఇదే లాస్ట్ స్టేట్మెంట్.. 2027లో ఖచ్చితంగా కమర్షియల్ బ్యాటరీలను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. దీంతో టొయోటా కంపెనీపై విమర్శలు వస్తున్నాయి. మరి ఈ విమర్శలను దాటుకుని కంపెనీ సాలిడ్ స్టేట్ బ్యాటరీలతో వస్తే ఈవీ రంగంలో ఒక విప్లవాన్ని, చరిత్రను సృష్టిస్తుంది. ఈ టెక్నాలజీని ఎలక్ట్రిక్ టూవీలర్ల కోసం అందుబాటులోకి తీసుకొస్తే కూడా బాగుంటుంది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.