దేశవ్యాప్తంగా రోజులో కొన్ని వందల ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదం అంటే ఒక ప్రాణం పోవడం మాత్రమే కాదు.. ఒక కుటుంబం రోడ్డున పడటం. కొందరి నిర్లక్ష్యం- అజాగ్రత్త పలు కుటుంబాల్లో తీరని వేదనను మిగులుస్తున్నాయి. తాము నమ్ముకున్న వారిని దూరం చేస్తున్నాయి.
రోడ్డు ప్రమాదాల వల్ల రోజుకి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనం నడపడం.. ఇలా కారణం ఏదైనా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎదుటి వారి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటోంది. తాజాగా ఓ టెక్ కంపెనీ సీఈవో ఘోర కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. డివైడర్ ను ఢీకొని కారు అతి వేగంగా వచ్చి ఆ మహిళను ఢీకొట్టింది. అమాంతం గాల్లోకి ఎగిరి ఆ మహిళ నేలను తాకింది. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు.
ముంబై వేదికగా నడుస్తున్న ఓ టెక్ కంపెనీకి రాజ్యలక్ష్మి విజయ్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఆమె ఎంతో యాక్టివ్ గా ఉండటమే కాదు.. ఫిట్ నెస్ ఫ్రీక్ కూడా. ఆమె తరచూ జాగింగ్ చేస్తుంటారు. కొన్నిసార్లు తమ టీమ్ తో కూడా కలిసి జాగింగ్ కి వెళ్తూ ఉంటారు. అయితే ఆ జాగింగ్ అలవాటే ఆవిడ ప్రాణాలు పోవడానికి కారణం అయ్యింది. ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో ముంబైలోని ఒర్లీ మిల్క్ డైరీ సమీపంలో రాజ్యలక్ష్మి జాగింగ్ చేస్తున్నారు. అటుగా వచ్చిన ఓ కారు ఆమెను వేగంగా ఢీకొట్టింది. ఆ కారు ఢీకొట్టిన వేగానికి రాజ్యలక్ష్మి అమాంతం గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడినట్లు అక్కడున్న కొందరు చెప్పారు.
ఆ కారును 23 ఏళ్ల సుమెర్ మర్చంట్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. తన స్నేహితురాలిని దింపేందుకు శివాజీ పార్క్ వైపు వేగంగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు మొదట డివైడర్ ను ఢీకొని ఆ తర్వాత రాజ్యలక్ష్మిని ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అతివేగం మాత్రమే కాకుండా.. అతను మద్యం సేవించి ఉన్నాడా అనే విషయంపై పోలీసులు రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. ప్రమాదం విషయాన్ని ఆమె భర్తకు తెలియజేయగానే పోడర్ ఆస్పత్రికి హుటాహుటిన వెళ్లారు. అప్పటికే రాజ్యలక్ష్మి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. తలకి బలమైన గాయాలు కావడం వల్లే మరణం సంభవించినట్లు తెలిపారు.
Mumbai: A 42-year-old CEO of a tech firm died on Sunday after being knocked down by a car at Worli sea-face promenade in south Mumbai during her morning walk. The deceased #RajalakshmiVijay was the CEO of Altruist Technologies, an IT and telecommunication firm in #Mumbai pic.twitter.com/pmvMGAMeJa
— Vivek Bajpai (@vivekbajpai84) March 19, 2023