దేశంలో ఇంధనం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో అందరూ ఎలక్ట్రిక్ వాహనాలపై ద్రుష్టి పెడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఇండియన్ దిగ్గజం, టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. “అవిన్య” అనే పేరుతో కొత్త ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. ‘అవిన్య’ సంస్కృత భాషలోని పదం. అవిన్య అంటే ఆవిష్కరణ అని అర్థం. అదే పేరుతో సూపర్ కారును ఆవిష్కరించింది టాటా మోటార్స్. ఈ కార్ 2025 లోగా అందుబాటులోకి వస్తుందని టాటా మోటార్స్ ప్రకటించింది.
టాటా మోటార్స్.. ‘టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ’లో(టీపీఈఎమ్) భాగంగా టాటా మోటార్స్ నెక్స్ట్ జెనరేషన్ ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందిస్తోంది. అందులో భాగంగానే ఈ కార్ ను ఆవిష్కరించనుంది. టాటా అవిన్య కార్ జెన్ 3 ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొంధించనున్నారు. ఈ కారులోని బ్యాటరీ, ఛార్జింగ్ సిస్టమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కారులో అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సామర్థ్యం ఉండనుంది. కేవలం 30 నిమిషాలు ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.
Production version of the Tata Avinya will be coming by 2025. @TataMotors pic.twitter.com/mKThKWdc5m
— Autocar India (@autocarindiamag) April 29, 2022
This is amazing man, always doing good stuff for the country, tata this is extremely gentle of them , props to everyone involved #AVINYA
New Paradigm Of Innovation pic.twitter.com/WGY2JUEygf— Reena Soni (@Reena1298) April 29, 2022
ఇది కూడా చదవండి: రేసింగ్ వాహనంతో పాల పంపిణీ! వీడియో వైరల్
ఇక డిజైన్ చూస్తే ఎప్పుడెప్పుడు మార్కెట్ లోకి వస్తుందా అని వాహనదారులు ఎదురు చూడాల్సిన పరిస్థితి. బటర్‌ఫ్లై డోర్స్ ఆకట్టుకుంటున్నాయి. కారు ఇంటీరియర్స్ అద్భుతంగా ఉన్నాయి. కారు స్టీరింగ్ నుంచి సీటింగ్ వరకు అంతా సరికొత్తగా కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితమే టాటా మోటార్స్ ‘Curvv’ పేరుతో ఎలక్ట్రిక్ట్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది మిడ్ సైజ్ ఎస్‌యూవీ. హైఎండ్ లగ్జరీ సెగ్మెంట్‌కు భిన్నంగా స్పోర్టీ కూప్ బాడీ స్టైల్, వినూత్నమైన డిజైన్ ఉంటుంది. ఈ డిజైన్ పై మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Inspired by the timeless elegance of the catamaran, the #AVINYA concept EV focuses on a human-centric design and promises a sensory journey of its own.
Stay connected by visiting our website: https://t.co/8M8tBioTRj#ANewParadigm #EvolveToElectric pic.twitter.com/z8H1mC0eF8
— Tata Passenger Electric Mobility Limited (@Tatamotorsev) April 29, 2022