ప్రపంచవ్యాప్తంగా స్నాప్ చాట్ యూజర్లు ఎంతో మంది ఉన్నారు. అన్ని సోషల్ యాప్స్ లాగానే స్నాప్ చాట్ కూడా ఎన్నో ఫీచర్స్, ఎన్నో అప్ డేట్స్ తీసుకొస్తుంటుంది. స్నాప్ చాట్ లో ఎన్నో ఫీచర్స్ కూడా ఉన్నాయి. అయితే స్నాప్ చాట్ తాజాగా యూజర్లకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది.
స్నాప్ చాట్ కు మంచి క్రేజ్ ఉంది. చాలా తక్కువ సమయంలో భారత్ లో ఎంతో మంది యాక్టివ్ యూజర్లను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా, అసలు ఏం చేయకపోయినా టక్కున ఫొటో తీసి స్నాప్ అంటున్నారు. ఇది అయితే చాలా మందికి పెద్ద హాబీగా మారిపోయింది. వారిని స్నాప్ స్ట్రీక్ ని కంటిన్యూ చేసుకోవడానికి నిత్యం ఒక యుద్ధమే చేస్తుంటారు. అలాంటి స్నాప్ చాట్ లో ఫీచర్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా యువత ఈ స్నాప్ చాట్ కి బాగా అలవాటు పడిపోయారు. యూజర్లలో కూడా యువతే ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పుడు యూజర్లకు స్నాప్ చాట్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది.
స్నాప్ చాట్ గురించి తెలియని యువత ఉండరేమో? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా స్నాప్ చాట్ అంత ఫేమస్ మరి. విదేశాల్లో ఈ యాప్ కి టిక్ టాక్ వంటి వాటి నుంచి గట్టిగానే పోటీ ఉంది. కానీ, భారత్ లో మాత్రం అలాంటి యాప్స్ లేవు కాబట్టి.. ఇన్ స్టాగ్రామ్, స్నాప్ చాట్ యాప్స్ నే బాగా వాడుతున్నారు. ఇప్పుడు యూజర్లకు స్నాప్ చాట్ ఒక శుభవార్త చెప్పింది. తాము ఇటీవల తీసుకొచ్చిన ‘మై ఏఐ’ని ఇన్నాళ్లు స్నాప్ చాట్+ సబ్ స్క్రైబర్స్ కి మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మై ఏఐని అందరు యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్నాప్ చాట్ సీఈవో ఎవన్ స్పైగల్ వెల్లడించారు.
ఈ ‘మై ఏఐ’ ఫీచర్ల విషానికి వస్తే.. ఇది చాట్ జీపీటీ సాయంతో పని చేస్తుంది. ఈ మై ఏఐ చాట్ బాట్ ని స్నాప్ చాట్ ఫిబ్రవరి 2023లో తీసుకొచ్చారు. దీని పాత వర్షన్స్ తో పోలిస్తే ఇది చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చెబుతున్నారు. మీ ఏఐ చాట్ బాట్ కోసం సొంత బిట్ మోజీని తయారు చేసుకోవచ్చు. అది చాలా రియలిస్టిక్ గా ఉండటమే కాదు.. మీలాగానే ఉంటుంది. మై ఏఐని మీరు స్నాప్ చాట్ గ్రూప్స్ లో యాడ్ చేయచ్చు, డీఎం కూడా చేయచ్చు. అయితే మీరు ‘@’ మై ఏఐ అని టైప్ చేయాలి. మీరు చేసే స్నాప్ లకి మై ఏఐ నుంచి మీకు రిప్లై కూడా లభిస్తుంది. స్నాప్ చాట్ యాక్టివిటీని బట్టి మీకు ఏఐ ఫిల్టర్స్ ని కూడా రికమెండ్ చేస్తుంటుంది. మరి.. స్నాప్ చాట్ తీసుకున్న ఈ స్టెప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.