ప్రీమియం స్మార్ట్‌ఫోన్లతో భారతీయ మార్కెట్ లోకి అడుగుపెట్టిన ‘వన్‌ప్లస్‘ సంస్థ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల ధర ఎక్కువుగా ఉండడంతో మధ్యతరగతి ప్రజలు దూరమవుతున్నారనే ఆలోచనతో ఒక మెట్టు కిందకు దిగి.. అందరకి అందుబాటులో ఉండేలా రూ.25,000 ధరలో నార్డ్ సిరీస్ సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. దీంతో వన్‌ప్లస్ ఫోన్లకు భారత మార్కెట్ లో మంచి ఆదరణ లభించింది. ఇక.. ప్రీమియం స్మార్ట్ ఫోన్లు తీసుకొస్తున్నా.. వాటిపై ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తాజాగా వన్‌ప్లస్ 10ఆర్ 5జీపై బంపరాఫర్ ప్రకటించింది.
వన్‌ప్లస్ 10ఆర్ 5జీ ధర, ఆఫర్:
వన్‌ప్లస్ 10ఆర్ 5జీ.. అమెజాన్ లో అందుబాటులో కలదు. దీని అసలు ధర.. ధర రూ 38,999కాగా, రూ. 3000 కూపన్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ గా అందిస్తోంది. ఈ ఆఫర్ అందరకి అందుబాటులో కలదు. వీటికి అదనంగా ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ. 1000 ఆఫర్ వర్తిస్తుంది. మొత్తంగా ఈ ఆఫర్లతో రూ. 4,000 డిస్కౌంట్ లభిస్తుండడంతో వన్‌ప్లస్ 10ఆర్ ను రూ. 34,999కే సొంతం చేసుకోవచ్చు.
వన్‌ప్లస్ 10ఆర్ 5జీ స్పెసిఫికేషన్స్:
వన్‌ప్లస్ 10ఆర్ ఫీచర్లను చూస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ఎంఏఎక్స్ ఎస్ఓసీ చిప్‌సెట్, 6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లేతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఈ లేటెస్ట్ స్మార్ట్‌పోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగిఉంది. 50ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపీ మ్యాక్రో కెమెరా ఉంది. ఇక సెల్ఫీల కోసం ముందుభాగంలో 16ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వన్‌ప్లస్ 10ఆర్ 5జీ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన వన్‌ప్లస్ 10ఆర్ 80W SuperVOOC ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్లాక్, గ్రీన్ కలర్స్‌లో లభిస్తోంది. ఈ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
OnePlus 10R 5G (128GB ROM, 8GB RAM, Forest Green) – 80W Super VOOC Charging
MRP: Rs 46,999
List Price: Rs 38,999 (Rs 3,000 Off – Discount Auto Applied in Cart)
Deal Price: Rs 35,999
ICICI CC EMI Price: Rs 34,999 (No Cost Also Available)
Link: https://t.co/rLSMd43Qhd#Croma
— Discounts Deck (@discountsdeck) July 12, 2022
ఇది కూడా చదవండి: OnePlus: మీ పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే.. సగం ధరకే OnePlus స్మార్ట్‌ఫోన్
ఇది కూడా చదవండి: OnePlus Nord Buds: సూపర్ ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్న వన్‌ప్లస్ ఇయర్ బడ్స్.. ధరెంతంటే?