మగాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువగా ఇంటర్నెట్ వినియోగిస్తున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ క్రమంలో గూగుల్ లో ఆడవారు ఏం వెతుకుతారో అనే అంశం మీద క్యూరియాసిటీ ఉంటుంది. అసలు పెళ్ళైన ఆడవారు గూగుల్ లో ఎలాంటి విషయాలను వెతుకుతున్నారో తెలుసా? ఆడవారు వెతికే పదాల గురించి అధ్యయనాలు ఏం చెబుతున్నాయో తెలుసా?
గూగుల్ లో దొరకని సమాచారం అంటూ ఏదీ ఉండదు. గూగుల్ ని ఒక్కొక్కరూ ఒక్కోలా వినియోగించుకుంటారు. అది సద్వినియోగం కావచ్చు, దుర్వినియోగం కావచ్చు. గూగుల్ ని వాడుకుని కొంతమంది జ్ఞానాన్ని పెంచుకుని గొప్ప గొప్ప వాళ్ళు అవుతుంటే.. కొందరు మాత్రం ఒక మనిషిని ఎలా హత్య చేయాలి? ఎలా ఆత్మహత్య చేసుకోవాలి? దొంగతనం ఎలా చేయాలి? స్కాములు ఎలా చేయాలి? అనే విషయాలు తెలుసుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ తర్వాత పోలీసులకు దొరికేస్తున్నారనుకోండి అది వేరే విషయం. ఇంకొంతమంది అయితే అశ్లీల వీడియోలు చూస్తుంటారు. ఇందులో ఆడవాళ్లు కూడా ఉంటారండోయ్. ఎక్కువగా మగవారే ఉంటారని పలు నివేదికలు చెబుతున్నాయి.
ఇలా ఉంటే కొత్తగా పెళ్ళైన ఆడవాళ్లు మాత్రం గూగుల్ లో వాటి గురించే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారని నివేదికలు వెల్లడించాయి. పెళ్ళైన మహిళలు ఎక్కువగా ఏం వెతుకుతున్నారన్న విషయంపై అధ్యయనం చేయగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. సెర్చ్ రిజల్ట్స్ లో ఎక్కువగా ఈ పదాలే కనిపిస్తున్నాయని.. ఈ పదాలనే పెళ్ళైన ఆడవారు సెర్చ్ చేస్తున్నారని తేలింది. భర్తను ఆకర్షించేలా కనబడాలని కొత్తగా పెళ్ళైన మహిళలు అనుకుంటారు. ఈ క్రమంలో పెళ్ళైన ఆడవారు.. ‘భర్తకు ఆకర్షణీయంగా కనబడడం ఎలా’ అని సెర్చ్ చేస్తున్నారట. భర్తలకు ఏది ఇష్టమో, ఏది అయిష్టమో అనే విషయాన్ని కూడా సెర్చ్ చేస్తున్నారట. పెళ్లయ్యాక భర్త మనసుని గెలుచుకోవడం ఎలా అనే విషయం గురించి కూడా వెతుకుతున్నారని తేలింది.
భర్తతో ఎలా గడపాలి, ఎలా భర్తని ఇంప్రెస్ చేయాలి అనే విషయాల గురించి సెర్చ్ చేస్తున్నారట. ఇక అత్తగారిని, మామగారిని జయించడం ఎలా? వారి మనసులని గెలుచుకోవడం ఎలా? వారిని ఇంప్రెస్ చేయడం ఎలా? వారితో ఎలా మెలగాలి? కుటుంబ సభ్యులను ఆకర్షించడం కోసం ఎలాంటి వంటకాలు చేయాలి? అనే విషయాలకు సంబంధించి సమాధానాలను గూగుల్ ని అడుగుతున్నారట. అలానే కుటుంబ బాధ్యతల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తన కుటుంబానికి ఎలా సపోర్ట్ గా ఉండాలి? అనే విషయాల మీద సెర్చ్ చేస్తున్నారని స్టడీస్ చెబుతున్నాయి. మరి పెళ్ళైన మగవారు గూగుల్ లో ఎలాంటి విషయాలను సెర్చ్ చేస్తారో కామెంట్స్ చేయండి.