రియల్ మీ కోకా కోలా ఎడిషన్ 5జీ స్మార్ట్ ఫోన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దాని లుక్స్, బ్యాక్ డోమ్ మీద ఉండే కోక్ డిజైన్ స్టైలిష్ గా ఉంది. ఈ కోక్ ఎడిషన్ ఇండియాలో లాంఛ చేశారు. దాని ధర, ఫీచర్లు అన్నింటిని రియల్ మీ వెల్లడించింది.
స్మార్ట్ ఫోన్లలో ఇప్పుడు అంతా 5జీ కే ఓటు వేస్తున్నారు. కొత్తగా ఫోన్ కొనాలి అనుకునే వాళ్లంతా దాదాపుగా 5జీ ఫోన్ కొనేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే దాదాపుగా అన్ని మొబైల్ కంపెనీలు 5జీ ఫోన్లను లాంఛ్ చేశాయి. వాటిలో కూడా వివిధ మోడల్స్ ను తీసుకొచ్చాయి. ఇప్పుడు రియల్ మీ కంపెనీకి చెందిన 10 ప్రో 5జీ ఫోన్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. రియల్ మీ 10 ప్రో ఫోన్ ని కోకాకోలా ఎడిషన్ గా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే వీళ్లు ఆ ఫోన్ లుక్స్ ని రిలీజ్ చేశారో అప్పటి నుంచి దీనిపై బాగా చర్చ జరిగింది. మొదట అంతా కోకాకోలా ఫోన్ అనుకున్నారు. కానీ, తర్వాత క్లారిటీ వచ్చింది. అది రియల్ మీ 10 ప్రో 5జీ కోకాకోలా ఎడిషన్ అని.
ఇప్పుడు ఈ ఫోన్ ఇండియాలో కూడా లాంఛ్ అయ్యింది. ఈ ఫోన్ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఇండియన్ మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ బుక్ చేసుకోవచ్చు. మధ్యాహ్న దీనిని ఫ్లిప్ కార్ట్, రిటైల్ స్టోర్లలో కూడా కొనుగోలు చేయచ్చు. ఇంక ఫోన్ ఫీచర్లు, ధర విషయంలో అంతా షాకయ్యారు. ఎందుకంటే కోకాకోలా ఎడిషన్ అంటూ ప్రత్యేకంగా తీసుకొస్తున్నారు.. కచ్చితంగా ధర ఎక్కువే ఉంటుందని భావించారు. కానీ, రియల్ మీ మాత్రం బడ్జెట్ ధరలోనే ఈ 5జీ ఫోన్ తీసుకొచ్చింది. 8జీబీ+ 128జీబీ వేరియంట్ ఫోన్ ధరని కేవలం రూ.20,999గానే నిర్ణయించారు.
6.72 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ+ ఎల్సీడీ స్క్రీన్ ని అమర్చారు. ఈ ఫోన్ 120 హెట్స్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. 240 హెట్జ్ టచ్ శాంపిలింగ్ రేట్, స్నాప్ డ్రాగన్ 695 5జీ, కోకాకోలా థీమ్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 వర్షన్ తో వస్తోంది. సైడ్ మౌంట్ ఫింగర్ సెన్సార్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంది. దీనిలో మీ ఫొటోలను 1980ల కాలంనాటి వాటిగా మార్చే ఒక కోలా ఫిల్టర్ ఒకటి ఉంది. బాటిల్ ఓపెనర్ సౌండ్ ని కెమెరా షట్టర్ సౌండ్ సౌండ్ పెట్టారు. 8 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ తో ఈ ఫోన్ వస్తోంది. దీనిలో 108 ఎంపీ కెమెరా ఉంది. ఈ ధర, ఫీచర్లు విన్న తర్వాత ఈ కోకాకోలా ఎడిషన్ స్మార్ట్ ఫోన్ కు క్రేజ్ మరింత పెరిగింది.