పోర్‌ట్రోనిక్స్ క్రోనోస్ బీటా స్మార్ట్ వాచ్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్ తక్కువ ధరలోనే మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో రియల్‌టైం హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా ఉంది. ఏడు రోజుల బ్యాటరీ బ్యాకప్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 100కు పైగా వాచ్ ఫేస్‌లు ఇందులో ఉన్నాయి. క్రోనోస్ బీటా స్మార్ట్ వాచ్ వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ ఇంకా 100 వాచ్ ఫేస్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్ బాడీ అల్యూమినియం ఇంకా పాలికార్బోనేట్‌తో తయారయ్యింది. ఈ ఫోన్ ధరను మనదేశంలో రూ.3,999గా నిర్ణయించారు.
పోర్ట్రానిక్స్ క్రోనోస్ బీటాలో ఆఫ్‌లైన్ మ్యూజిక్ ప్లేబ్యాక్ ఆప్షన్ కూడా ఉంది. దీని కోసం ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఇచ్చారు. పోర్ట్రానిక్స్ క్రోనోస్ బీటా స్మార్ట్‌వాచ్‌ను బ్లాక్, గ్రే అండ్ రోజ్ పింక్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. దీనిని పోర్ట్రానిక్స్ వెబ్‌సైట్ లేదా ఇతర ఆన్‌లైన్ పోర్టల్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ వాచ్ భారతదేశంలోని ఎంఐ, రెడ్‌మి, అమేజ్‌ఫిట్, ఫైర్‌బోల్ట్ వంటి సంస్థల స్మార్ట్‌వాచ్‌లతో పోటీ పడటం ఖాయం. పోర్ట్రానిక్స్ క్రోనోస్ బీటా వాచ్ టచ్ సపోర్ట్‌తో పాటు 1.28-అంగుళాల టిఎఫ్‌టి రౌండ్ డిస్ ప్లే ఉంటుంది. ఈ వాచ్ లో 512ఎంబి స్టోరేజ్ ఉంది, ఇందులో 300 పాటలు స్టోర్ చేయవచ్చు.
యాక్టివిటీ, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో 24 గంటల హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా ఉంది. రన్నింగ్, వాకింగ్, హైకింగ్, స్టెయిర్ స్టెప్స్ వంటి యాక్టివిటీస్‌ను కూడా ఇది ట్రాక్ చేయగలదు. పోర్ట్రానిక్స్ 100 వాచ్ ఫేస్‌లతో వస్తుంది. స్వంత వాచ్ ఫేస్‌లను కంపానియన్ యాప్ ద్వారా కూడా సృష్టించవచ్చు. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ v5.1, వాటర్ రిసిస్టంట్ కోసం దీనికి IP68 రేటింగ్ లభించింది.
దీనిలో 240mAh బ్యాటరీ ఇచ్చారు అలాగే ఏడు రోజుల క్లెయిమ్ బ్యాకప్‌తో వస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 240 ఎంఏహెచ్‌గా ఏడు రోజుల బ్యాటరీ లైఫ్‌తో బిల్ట్ ఇన్ బ్యాటరీని గంటలో పూర్తిగా చార్జ్ చేయవచ్చని అంటే గంట చార్జింగ్‌తో వారం పాటు ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది.