ఇయర్ బడ్స్ వాడకం బాగా పెరిగింది. అలాగే ఇయర్ బడ్స్ లో కొత్త కొత్త మోడల్స్ కూడా వస్తున్నాయి. అయితే కొంచెం మంచి ఫీచర్స్ ఉన్న ఇయర్ బడ్స్ మాత్రం ధర ఎక్కువగా ఉంటున్నాయి. బడ్జెట్ లో ఇయర్ బడ్స్ చాలా ఉన్నా కూడా ఫీచర్స్ మాత్రం అంతగా ఉండటం లేదు. ఇప్పుడు ధర బడ్జెట్ లో అదిరిపోయే ఫీచర్లతో ఒక ఇన్ ఇయర్ బడ్స్ మోడల్ అందుబాటులో ఉంది.
ఇయర్ బడ్స్ కు ప్రజలు బాగా అలవాటు పడిపోయారు. రోజులో ఒక గంటసేపు అయినా వాటిని వాడాల్సిందే. అయితే ఇయర్ బడ్స్ ఇప్పుడు బాగా ఖరీదుగా మారిపోతున్నాయి. కొత్త కొత్త కంపెనీలు సరికొత్త ఫీచర్లతో తీసుకొస్తున్న ఇయర్ బడ్స్ ధర ఎక్కువగానే ఉంటున్నాయి. అయితే ప్రోట్రోనిక్స్ కంపెనీ మాత్రం అతి తక్కువ ధరలో ఇన్ ఇయర్ బడ్స్ ని తీసుకొస్తోంది. ఈ మోడల్ ఇయర్ బడ్స్ ని బైక్ డ్రైవ్ చేసే వాళ్లు ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే వారికి హెల్మెట్ పెట్టుకున్నా కూడా కంఫర్ట్ గా ఉంటాయి. ఎందుకంటే సైజ్ లో కూడా చాలా చిన్నగా ఉంటాయి ఇవి. అలాగే మోడల్ కూడా అందరికీ బాగా నచ్చేస్తోంది. ఇప్పటికే ఈ తరహాలో కొన్ని మోడల్స్ క్లిక్ అయ్యాయి కూడా.
ప్రొట్రోనిక్స్ కంపెనీ ఇన్ ఇయర్ బడ్స్ కి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే పోట్రోనిక్స్ హార్మనిక్స్ టీఎస్3 అనే పేరుతో ఒక మోడల్ రిలీజ్ అయ్యింది. ఆ మోడల్ అయితే ఇప్పుడు కేవలం రూ.699 నుంచే అందుబాటులో ఉంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ప్రొట్రోనిక్స్ హార్మనిక్స్ టీఎస్5 అనే మోడల్ ని రిలీజ్ చేశారు. దీని ఎమ్మార్పీ రూ.2,999 కాగా 63 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,099కే అందిస్తున్నారు. అయితే ఇది రిలీజ్ సందర్భంగా పెట్టిన ధరగా చెబుతున్నారు. ఒకవేళ తర్వాత ధర పెరిగే అవకాశం ఉండచ్చు. లుక్స్ పరంగా కూడా ఇది చాలా స్టైలిష్ గా ఉంది. ఈ ఇన్ ఇయర్ బడ్స్ కేస్ కి డిజిటల్ డిస్ ప్లే ఉంటుంది. కేస్ లో ఎంత ఛార్జింగ్ ఉంది అనే విషయాన్ని చూపిస్తూ ఉంటుంది.
ఇంక ఈ ప్రొట్రోనిక్స్ హార్మానిక్స్ టీఎస్5 ఇన్ ఇయర్ బడ్స్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది లేటెస్ట్ 5.2 బ్లూటూత్ టెక్నాలజీతో వస్తోంది. డివైజ్ లకు ఇది చాలా త్వరగా కనెక్ట్ అవుతుంది. ఈ డిజైన్ మీ రొటీన్ లైఫ్ కోసం బాగా యూజ్ ఫుల్ గా ఉంటుంది. అంటే జిమ్ సమయంలో కూడా మీరీ ఈ ఇన్ ఇయర్ బడ్స్ ని వాడచ్చు. ఇందులో సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంది. అంటే 6 నిమిషాలు ఛార్జ్ చేస్తే మీకు 90 నిమిషాల ప్లే టైమ్ లభిస్తుంది. ఓవరాల్ గా 15 గంటల ప్లే టైమ్ లభిస్తుంది. బేస్ ఇష్టపడేవారికి ఇవి బాగా నచ్చుతాయి. మంచి బేస్ ఎక్స్ పీరియన్స్ కోసం ఇందులో ప్రత్యేకంగా డ్రైవర్స్ ఉన్నాయి. ఇందులో ఐపీఎక్స్4 వాటర్ ప్రూఫ్ టెక్నాలజీ ఉంది. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి ఇవి నచ్చకపోవచ్చు. ఈ ప్రొట్రోనిక్స్ హార్మానిక్స్ టీఎస్5 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.