ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో సూపర్ సక్సెస్ అయిన వన్‌ప్లస్.. నార్డ్ సిరీస్‌తో మిడ్ రేంజ్‌లోనూ దుమ్మురేపుతోంది. రూ.30 వేలలోపు వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ ఫోన్లు మంచి క్రేజ్ సంపాదించాయి. అయితే త్వరలోనే వన్‌ప్లస్ మరో ముందడుగు వేయనుంది. రూ.20వేలలోపే ఓ నార్డ్ స్మార్ట్‌ఫోన్ తీసుకురానుంది.
ఈ ఏడాది జూలై తర్వాత ఇది భారత మార్కెట్లోకి వస్తుందని అంచనా వేశారు. ప్రస్తుతం వన్‌ప్లస్ ఫోన్‌లన్నీ రూ.20వేల కంటే ఎక్కువ ధరతోనే ఉన్నాయి.
బడ్జెట్ నార్డ్ ఫోన్.. లీకైన స్పెసిఫికేషన్లు
ప్రస్తుతం ఈ చౌకైన వన్‌ప్లస్ నార్డ్ మొబైల్ తయారీ ప్రారంభ దశలోనే ఉంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు బయటికి వచ్చాయి. ముఖ్యంగా 90హెట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే అమోలెడ్ డిస్‌ప్లేతో ఈ స్మార్ట్‌ఫోన్ రానుంది. అలాగే 5జీ కనెక్టివిటీ, మీడియాటెక్ ప్రాసెసర్‌తో వస్తోంది. మరోవైపు ఈ వన్‌ప్లస్ ఫోన్ వెనుక 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో రానుందని సమాచారం. వన్‌ప్లస్ నార్డ్ 3 విడుదలైన తర్వాత ఈ మొబైల్ మార్కెట్లోకి రానుంది.
New upcoming Oneplus nord series smartphones
With snapdragon 690
Price :- Below 20000
Expected Launch date :- October
@oneplus #oneplusnord #newleaks #newoneplus pic.twitter.com/FVXQwBO3iV— MrVISHjr (@HjrVis) August 11, 2020