వన్ ప్లస్ ఫోన్ కి భారత్ లో మంచి మార్కెట్ ఉంది. ఈ ఫోన్ వచ్చిన తర్వాత యాపిల్ కంపెనీకి గట్టి పోటీ ఎదురైంది. ఇప్పుడు వన్ ప్లస్ నుంచి మంచి 5జీ ఫోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వన్ ప్లస్ కంపెనీ తమ 5జీ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్స్ కూడా ప్రకటించింది.
వన్ ప్లస్.. ఈ ఫోన్ కి ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్ కంపెనీకి వన్ ప్లస్ గట్టి పోటీ ఇచ్చింది అని చెప్పచ్చు. ఎందుకంటే యాపిల్ ఫోన్ కొనాలి అనుకున్న ఎంతో మంది వన్ ప్లస్ కు మారారు. ఒకప్పుడు వన్ ప్లస్ ఫోన్లు కూడా ఖరీదుగానే ఉండేవి. ఇప్పుడు వన్ ప్లస్ నుంచి కూడా బడ్జెట్ ఫోన్లు వస్తున్నాయి. నార్డ్ సిరీస్ కి మధ్యతరగతి కస్టమర్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే వన్ ప్లస్ నార్డ్ సిరీస్ ని కొనసాగిస్తోంది. ఇప్పుడు కస్టమర్స్ ని 5జీకి మార్చేందుకు వన్ ప్లస్ సరికొత్త ఆఫర్స్ తో ముందుకొచ్చింది. ఇప్పటికీ 4జీ ఫోన్స్ వాడే వారిని 5జీకి అప్ గ్రేడ్ చేయాలని చూస్తోంది.
వన్ ప్లస్ కంపెనీ నుంచి కూడా విరివిగా 5జీ మోడల్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే మార్కెట్ లో వన్ ప్లస్ 5జీ ఫోన్స్ ఉన్నాయి. అయితే వన్ ప్లస్ 4జీ ఫోన్స్ వాడుతున్న కస్టమర్స్ చాలా మంది ఉన్నారు. వారిని ఇప్పుడు 5జీకి మార్చాలని వన్ ప్లస్ భావిస్తోంది. అందుకు ఒక అప్ గ్రేడ్ ప్లాన్ తీసుకొచ్చింది. దీని ద్వారా మీ పాత వన్ ప్లస్ ఫోన్, ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఇలా ఏ 4జీ ఫోన్ ని ఎక్స్ ఛేంజ్ చేసి మీరు వన్ ప్లస్ 5జీ ఫోన్ ని కొనుగోలు చేసినా మీకు రూ.3 నుంచి రూ.10 వేల వరకు ఎక్స్ ఛేంజ్ బోనస్లు ప్రకటించింది. మీ పాత ఫోన్ ఎక్స్ ఛేంజ్ చేసి కొత్త వన్ ప్లస్ 5జీ ఫోన్ కొనుగోలు చేస్తే.. రూ.10 వేల వరకు అదనపు డిస్కౌంట్స్ పొందచ్చనమాట.
అయితే ఈ ఆఫర్స్ లిమిటెడ్ సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మార్చి 21న ప్రారంభమైన ఈ 5జీ అప్ గ్రేడ్ ప్లాన్ ఆఫర్స్ ఏప్రిల్ 2 వరకు కొనసాగనున్నట్లు వన్ ప్లస్ సంస్థ తెలిపింది. అంతేకాకుండా వన్ ప్లస్ 11 సిరీస్ తో పాటుగా జియో ట్రూ5జీకి మారితే మీకు రూ.11,200 వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. వన్ ప్లస్ 11 5జీ మోడల్ పై గరిష్టంగా రూ.6 వేల వరకు అదనపు బోనస్ పొందచ్చు. వన్ ప్లస్ 11ఆర్ 5జీ మోడల్ పై రూ.3 వేల వరకు అదనపు డిస్కౌంట్స్ పొందచ్చు. వన్ ప్లస్ 10 ప్రో 5జీపై రూ.10 వేల వరకు, 10టీ 5జీ మోడల్ పై రూ.11 వేల వరకు, 10ఆర్ 5జీపై రూ.3 వేల వరకు అదనపు బోనస్ పొందే అవకాశం ఉంది. ఇది కేవలం ఏప్రిల్ 2 వరకు అందుబాటులో ఉంటుంది.