కరోనా కష్టకాలం తర్వాత ఇప్పుడు స్మార్ట్ ఉత్పత్తులకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే స్మార్ట్ బ్రాండ్లు అయిన స్మార్ట్ వాచ్ లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో నాయిస్ సంస్థ బ్రాండ్ ట్రు వైర్లెస్ ఇయర్ఫోన్లకు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో వేరబుల్స్ తయారీ సంస్థ మొట్ట మొదటి సారిగా ఎంతో ఆకర్షనీయమైన స్మార్ట్ గ్లాసెస్ ని లాంచ్ చేసింది. నాయిస్ ఐ1 స్మార్ట్ ఐవేర్ పేరుతో భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో.. ఆడియో ప్రధానంగా ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను నాయిస్ తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ గ్లాసెస్ లో ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయని సంస్థ తెలిపింది.
కాకపోతే ఈ నాయిస్ స్మార్ట్ గ్లాసెస్ కి కెమెరాలు ఉండవు. ఈ స్మార్ట్ గ్లాస్ లో ఆడియోకి సంబంధించిన ఫీచర్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో కాల్స్ కోసం మైక్ కూడా ఉంది. మ్యూజిక్ వినేందుకు స్పీకర్లు చాలా బాగా పనిచేస్తాయి. ఇందులో మిగిలిన ఫీచర్లు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆ కంపెనీల స్మార్ట్ గ్లాసెస్‌తో పోలిస్తే ధర కూడా తక్కువగానే ఉంది. ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో ఎన్నో గూగుల్, స్నాప్, రేబన్ తీసుకొచ్చిన స్మార్ట్ గ్లాసెస్‌తో పోలిస్తే ఇది ఎంతో భిన్నంగా కనిపిస్తుంది.