కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంది. టెస్టింగ్ సెంటర్ కి వెళ్లాలి. అక్కడ రోగి ముక్కు, గొంతు నుంచి నమూనాలు సేకరిస్తారు. ఈ క్రమంలో బాధితుడికి కొంత నొప్పి కలగడం సహజం. ఆ తర్వాత శాంపిల్స్ ను ల్యాబ్ కి పంపుతారు. రిజల్ట్ రావడానికి బాగా సమయం పడుతుంది. అయితే, ఈ బాధలేవీ లేకుండా సొంతంగా ఇంట్లోనే కరోనా నిర్ధారణ టెస్ట్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వస్తే!?. జన్యువుల్లో మార్పులు చేయడానికి ఉపయోగించే క్రిస్పర్ పరిజ్ఞానంతో ‘మి షెర్లాక్’ను తయారు చేశారు. మినిమల్లీ ఇన్‌స్ట్రూమెంటెడ్ షెర్లాక్’ (మిషెర్లాక్). దీన్ని ఉపయోగించడం చాలా తేలిక.
హార్వర్డ్ వర్సిటీ, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు ఈ ఘనత సాధించారు. గంటలోగా మన స్మార్ట్‌ఫోన్ యాప్‌పై ఫలితాన్ని పొందొచ్చు. ఇది కరోనాలోని మూడు భిన్న వేరియంట్లను విజయవంతంగా గుర్తించగలిగింది. డెల్టా వంటి అదనపు రకాలను గుర్తించేలా సాధనంలో సర్దుబాటు చేయవచ్చు” అని సైంటిస్టులు తెలిపారు. త్రీడీ ప్రింటర్, అందుబాటులో ఉన్న ఉపకరణాల సాయంతో ఈ యంత్రాన్ని సిద్ధం చేసినట్లు వారు వెల్లడించారు.
ఇది లాలాజలాన్ని(సలైవా) విశ్లేషిస్తుందని, చాలా చీప్ అని చెప్పారు. హార్వర్డ్ వర్సిటీ, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు ఈ ఘనత సాధించారు.ఈ క్రమంలో ఒక ఫ్లోరసెంట్ సంకేతం వెలువడుతుంది. దీని ఆధారంగా కరోనా ఉనికిని గుర్తించొచ్చు. వైరస్‌లోని ఆల్ఫా, బీటా, గామా వేరియంట్లను ఈ సాధనం సులువుగా పసిగడుతుంది.