మరో నెలలో శీతాకాలం ముగియనుంది. రాబోయేదంతా మండు వేసవి. ఏడాదికి ఏడాది ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచే కాలు బయటపెట్టలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి సమయంలో కాస్త ఊరట నిచ్చేవి.. ఏసీలే. గతంలో అంటే ఏసీల ధరలు ఎక్కువుగా ఉండేవి.. సామాన్య ప్రజలు వెనకడుగు వేసేవారు. కానీ, ఇప్పుడలా లేదు. తక్కువ ధరకే ఎన్నో కంపెనీల నాణ్యత గల ఏసీలు అందుబాటులోకి వచ్చేశాయి. తాజాగా, MarQ కంపెనీ శక్తివంతమైన 4 ఇన్ 1 కన్వర్టిబుల్ ఎయిర్ కండీషనర్‌ల కొత్త శ్రేణిని విడుదల చేసింది. నిమిషాల వ్యవధిలనే ఇంటిని చల్లబరచడం దీని ప్రత్యేకత. దీని ధర, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వేలకు.. వేలు పెట్టి బ్రాండెడ్ వస్తువులు కొనే రోజులు పోయాయి. మంచి రేటింగ్ అండ్ రివ్యూ, సరసమైన ధరలలో అందుబాటులో ఉన్నాయా! కొనేయడమే. MarQ విడుదల చేసిన 4 ఇన్ 1 కన్వర్టిబుల్ ఏసీ అలాంటి అత్యత్తమ ప్రయోజనాలనే అందిస్తుందని చెప్తోంది.. కంపెనీ. ఇందులో ‘టర్బో కూల్ మోడ్’ ఫీచర్ ఉండటం వల్ల సాధారణ ఏసీలతో పోలిస్తే.. 19 శాతం ఎక్కువుగా 20 నిమిషాల్లో గదిని చల్లబరుస్తుందని అంటోంది. అంతేకాదు.. ఇందులో ఉన్న ECO మోడ్ వల్ల విద్యుత్ వినియోగం చాలా తక్కువట. అలాగే.. గ్యాస్ ఫ్లో రేట్‌ను నియంత్రించడానికి, పవర్ హెచ్చుతగ్గుల నుంచి రక్షించడానికి అత్యత్తమ టెక్నాలజీ ఉపయోగించినట్లు పేర్కొంది.
MarQ కొత్త రకం ఏసీ శ్రేణిలు “ఇన్వర్టర్ టెక్నాలజీ”తో పాటు తాజా బీ స్టార్ రేటింగ్‌తో వస్తున్నాయి. మొత్తం 6 మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇవి ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి రానున్నాయి. వీటి ప్రారంభ ధర రూ. 25999 నుంచి మొదలుకానుంది. ఎండకాలం సమీపిస్తున్న కొద్దీ ఏసీల ధరలు పెరుగుతాయి. కొనాలనే ఆలోచన ఉంటే.. ముందుగానే ప్లాన్ చేసుకోండి.