యాపిల్ కంపెనీ నుంచి ఐఫోన్ కి సంబంధించి కొత్త కొత్త మోడల్స్ విడుదల అవుతూనే ఉంటాయి. అయితే ఐఫోన్ 15 విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నా కూడా ఆ మోడల్ కి సంబంధించిన రెండర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే ఐఫోన్ 15కి సంబంధించిన ఫీచర్లు కూడా ఇప్పుడు లీకయ్యాయి.
ఐఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కాకపోతే ధర విషయంలోనే చాలామంది వెనకాడుతూ ఉంటారు. చాలామంది ఈ ఐఫోన్ కొనాలి అనేది గోల్ గా కూడా పెట్టుకుంటారు. అయితే మరి కొంతమంది మాత్రం ఐఫోన్ కలెక్షన్ హాబీగా పెట్టుకుంటారు. అంటే వచ్చిన ప్రతి మోడల్ ని కొనేస్తుంటారు. మార్కెట్ లోకి కొత్త మోడల్ వస్తే అది ఎంత ధర అయినా, ఎంత కష్టమైనా కొనేయాలని చూస్తుంటారు. అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే యాపిల్ నుంచి రాబోతున్న ఐఫోన్ 15 డిజైన్, రెండర్స్ లీక్ అయ్యాయి. కొన్ని ఫీచర్ల విషయంలో కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి.
మొన్నీమధ్యే ఐఫోన్ 14 రిలీజ్ అయ్యింది.. అప్పుడే ఐఫోన్ 15 ఏంటి అంటారా? అవును నిజానికి ఐఫోన్ 15 రిలీజ్ కావడానికి ఇంకా చాలా సమయమే ఉంది. కానీ, యాపిల్ ప్రోడక్ట్స్ కి సంబంధించిన గాసిప్స్, రూమర్స్, వార్తలను అందిచే 9TO5Mac ఇటీవలే ఐఫోన్ 15 రెండర్స్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఐఫోన్ 15కి సంబంధించిన 3డీ కాడ్ ఫైల్స్ ని రివీల్ చేశారు. 3డీ ఆర్టిస్ట్ ఇయాన్ జెల్బో ఐఫోన్ 15కి సంబంధించిన ఊహాజనిత చిత్రాలను తయారు చేశాడు. ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈసారి ఐఫోన్ 15లో డార్క్ రెడ్, లైట్ బ్లూ, డార్క్ పింక్ కలర్స్ ఉండే అవకాశం ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
🚨 New iPhone 15 CADs reveal larger 6.2” display, Dynamic Island on all models, and USB-C!
Source: @9to5Mac/@ianzelbo pic.twitter.com/wL3AEAEVqI
— Apple Hub (@theapplehub) February 22, 2023
అలాగే ప్రో వర్షన్ మోడల్స్ కు ర్యామ్ ని కూడా పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే 6.7 ఇంచెస్ డిస్ ప్లే ఉండచ్చని తెలుస్తోంది. ఈసారి ప్రో మోడల్స్ కు 8జీబీ వరకు ర్యామ్ ఉంటుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న యూఎస్ బీ సీటైప్ ఛార్జింగ్ పోర్ట్ ఐఫోన్ 15కి ఉంటుందని చెబుతున్నారు. ఫాస్టర్ ఛార్జింగ్, డేటా ట్రాన్సఫర్ కి ఈ టైప్ సీ ఛార్చర్ పోర్ట్ ఉపయోగపడుతుంది. యాపిల్ సంస్థ మ్యాక్ బుక్స్, ఐపాడ్స్ కి మాత్రమే టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ వాడింది. ఐఫోన్ లో ఈ పోర్ట్ తీసుకురావడం ఇదే మొదటిసారి. అయితే తప్పనిసరి పరిస్థితుల్లోనే యాపిల్ సంస్థ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
Looks like red is the new color for iPhone 15 Pro 👀 https://t.co/dYcbQzgqqM pic.twitter.com/8ZSKluaftQ
— Ian Zelbo (@ianzelbo) February 23, 2023
ఎందుకంటే యూరప్ లో నిబంధనల ప్రకారం అన్నీ మొబైల్ కంపెనీలు కామన్ ఛార్జింగ్ పోర్ట్ వాడాలి. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో యాపిల్ సంస్థ ఐఫోన్ 15 నుంచి ఈ టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. స్టాండర్డ్ ఐఫోన్ మోడల్స్ కు రెండు కెమెరాలనే అందిస్తోంది. ప్రో మోడల్స్ కి మాత్రమే మూడు కెమెరాలు ఉంటాయని చెబుతున్నారు. ఇంక ధరకు సంబంధించి ఎలాంటి గాసిప్స్ రాలేదు. కానీ, లీకైన వివరాలు, ఫీచర్లను బట్టి ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ భారీ ధరే ఉండచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. లీకైన ఐఫోన్ 15 డిజైన్, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Leak Suggests iPhone 15 Display Could Be Larger Than iPhone 14 https://t.co/36p2F66H1l by @waxeditorial pic.twitter.com/GmQchxQZYl
— MacRumors.com (@MacRumors) February 23, 2023