స్మార్ట్ ఫోన్ అంటే చాలామంది చాలా ఖరీదుగా ఉంటాయి అనుకుంటారు. కొందరైతే ధర తెలుసుకోకముందే కొనకూడదని ఫిక్స్ అవుతారు. అయితే మార్కెట్ లో బడ్జెట్ లో కూడా చాలానే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. తాజాగా ఆ లిస్టులోకి కొత్త ఫోన్ వచ్చి చేరింది. ఆ ఫోన్ ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.
స్మార్ట్ ఫోన్ లేకపోతే మేం బతకలేం అనే పరిస్థికి వచ్చేస్తున్నారు ప్రజలు. కొందరు ఈ ఫోన్ ని అవసరం, టైమ్ పాస్ కోసం వాడుతున్నారు. ఇంకొందరు మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ తోనే ఉపాధి పొందుతున్నారు. చాలామందికి స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి అని ఉన్నా కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల కొనుక్కోలేకపోతున్నారు. అయితే అలాంటి వారికోసం కూడా మార్కెట్ లో ఎన్నో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అయితే రూ.పది వేలకు దిగువన చాలా తక్కువ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ లోకి ఒక కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలైంది. రేటు విషయానికి వస్తే కేవలం రూ.7,299కే అందిస్తున్నారు. మరి.. ఆ స్మార్ట్ ఫోన్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దాం.
స్మార్ట్ ఫోన్ అంటే దిగువ మధ్యతరగతి వాళ్లకు కొనేందుకు కాస్త కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఏ ఫోన్ అయినా కూడా రూ.10 వేలకుపైనే ఉంటోంది. కానీ, ఇన్ ఫినిక్స్ అనే కంపెనీ మాత్రం రూ.10 వేలలోపు స్మార్ట్ ఫోన్ తీసుకురావడమే కాకుండా.. కేవలం రూ.7,299కే స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ప్రస్తుతం ఫోన్ లాంఛింగ్ ఆఫర్ కింద ఈ ధరకు ఫోన్ అందిస్తున్నారు. నిజానికి ఈ ఫోన్ ఎమ్మార్పీ రూ.9,999కాగా ప్రస్తుతం రూ.7,299కే విక్రయిస్తున్నారు. ఈ ఆఫర్ ప్రైస్ ఎన్నిరోజులు ఉంటుందో క్లారిటీ ఇవ్వలేదు. ఈ ధర ఎప్పుడైనా పెరగచ్చు. ఫిబ్రవరి 27 నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.6 ఇంచెస్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లేతో వస్తోంది. ఆండ్రాయిడ్ 12, 1.6 గిగాహెట్స్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 ఎంపీ రేర్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లతో వస్తోంది. బ్లూ, గ్రీన్, బ్లాక్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. శాంసంగ్ నుంచి ఈ ఫీచర్లతో గ్యాలెక్సీ M04 అనే మోడల్ అందుబాటులో ఉంది. దీనిలో కూడా 4 జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 12, 13+ 2 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో ఉంది. దీని ధర విషయానికి వస్తే.. రూ.8,999కి అందిస్తున్నారు. ఈ శాంసంగ్ M04 ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
Multitasking hone wali hai makkhan smoooooth, kyunki aa raha hai naya Infinix SMART 7, with up to 7GB RAM! 🤯
Smartphone ki dunia mein TOOFAAN aane wala hai, because the Infinix SMART 7 is launching tomorrow! 🔥
Click here to know more: https://t.co/HaL9N0KI1a#Smart7 pic.twitter.com/lCFS0FOY9x
— Infinix India (@InfinixIndia) February 21, 2023