స్మార్ట్ గ్యాడ్జెట్స్ పై వినియోగదారుల్లో నానాటికి క్రేజ్ పెరుగుతూనే ఉంది. కస్టమర్స్ వినియోగం, అవసరాలకు తగ్గట్లుగా కొత్త కొత్త మోడల్స్, ఫీచర్స్ తో స్మార్ట్ వాచెస్ మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి. అయితే ఇప్పుడు హ్వావే కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఓ సూపర్ స్మార్ట్ వాచ్ టెక్ మార్కెట్ ని ఊపేస్తోంది.
స్మార్ట్ గ్యాడ్జెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పైగా స్మార్ట్ వాచ్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో. రోజు రోజుకీ మార్కెట్ లో స్మార్ట్ వాచ్ లకు డిమాండ్ బాగా పెరిగిపోతోంది. స్మార్ట్ గ్యాడ్జెట్స్ దిగ్గజ కంపెనీలే కాకుండా.. కొత్త కొత్త కంపెనీలు కూడా ఈ స్మార్ట్ వాచెస్ తయారు చేయడం ప్రారంభించాయి. అయితే ఫీచర్లు, డిజైన్స్, ధరల విషయంలో అన్నీ కూడా తీవ్రంగా పోటీపడుతున్నాయి. వినియోగదారులు కూడా ఏ వాచ్ ఎంచుకోవాలి తేల్చుకోలేని పరిస్థితికి వచ్చారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే స్మార్ట్ వాచ్ ఎంతో ప్రత్యేకం, చాలా అరుదైన డిజైన్ అనే చెప్పాలి.
ఈ సూపర్ వాచ్ ను హ్వావే కంపెనీ రూపొందించింది. నిజానికి యూకే, యూఎస్ఏలో ఈ ఫోన్ తయారీ కంపెనీ అగ్రగామిగా కొనసాగింది. కానీ, తర్వాత ట్రంప్ హయాంలో ఈ కంపెనీ తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఈ సూపర్ కూల్ స్మార్ట్ వాచ్ తో తిరిగి తాము అగ్రగామిగా ఎదగాలి ఆకాంక్షిస్తోంది. ఈ హ్వావే వాచ్ బడ్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే మీరు బడ్స్ వాడాలి అంటే అందుకు సెపరేట్ కేస్ కావాలి. కానీ, ఈ స్మార్ట్ వాచ్ కొనుక్కుంటో మీ స్మార్ట్ వాచే మీకు బడ్స్ కేస్ గా ఉపయోగపడుతుంది. ఈ స్మార్ట్ వాచ్ లోనే ఇయర్ బడ్స్ ఇన్ బిల్ట్ గా ఉంటాయి. అందుకే వీటికి వాచ్ బడ్స్ అని పేరు పెట్టారు.
ఈ వాచ్ బడ్స్ 2 ఇన్ 1 మోడల్ స్మార్ట్ వాచ్ ను మొదట చైనాలో లాంఛ్ చేశారు. తర్వాత యూరప్ లో కూడా దీనిని రిలీజ్ చేశారు. ఈ వాచ్ బడ్స్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ వాచ్ 1.3 ఇంచెస్ డిస్ ప్లే, జీపీఎస్ సపోర్ట్, బ్లూటూత్ కాలింగ్, ఐపీ54 వాటర్ రెసిస్టెన్స్, డస్ట్ ప్రూఫ్, హార్ట్ రేట్ మోనిటర్, బ్లడ్ ఆక్సిజన్ మోనిటర్, స్లీప్ ట్రాకింగ్, స్టెప్ కౌంట్, కేలరీ కౌంట్ వంటి హెల్త్ రిలేటెడ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ వాచ్ బడ్స్ 2 ఇన్ 1.. 410 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వస్తోంది. ఇంకా ఈ వాచ్ లో వాచ్ ఫేసెస్, రొటేటింగ్ క్రౌన్ వంటి ఫీచర్లు చాలానే ఉన్నాయి. చైనా, యూరప్ వినియోగదారులు ఈ కొత్త వాచ్ బడ్స్ కి బాగా ఆకర్షితులౌతున్నారు.
ఈ వాచ్ ధర విషయానికి వస్తే.. చైనా, యూరప్ లో దీనిని రూ.44 వేల వరకు విక్రయిస్తున్నారు. ఇండియన్ మార్కెట్ లో ఇంకా ఈ వాచ్ రిలీజ్ కాలేదు. ఒకవేళ అయినా కూడా ఇంత ఖరీదైన వాచ్ కు ఆదరణ లభించడం పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. అలాగే ఈ వాచ్ బడ్స్ లో డ్రా బ్యాక్స్ కూడా లేకపోలేదు. టెక్ నిపుణులు అభిప్రాయాల ప్రకారం.. ఈ వాచ్ బడ్స్ సైజ్ పరంగా చాలా పెద్దగా ఉన్నట్లు చెబుతున్నారు. అలాంటి వాచెస్ చాలా తక్కువ మంది మాత్రమే ఇష్టపడే అవకాశం ఉందుటున్నారు. మరోవైపు ఈ 410 ఎంఏహెచ్ బ్యాటరీలో బడ్స్ కి ఉపయోగ పడేది 30 ఎంఏహెచ్ మాత్రమే. ఆ ఛార్జింగ్ కెపాసిటీతో బడ్స్ 50 శాతం వాల్యూమ్ తో కేవలం 3 నుంచి 4 గంటలు మాత్రమే పనిచేస్తాయి.
เมื่อหูฟัง รวมร่างกับ Smart Watch !
Huawei Watch Buds 🔥💕 pic.twitter.com/IO7OcnpHod
— IAUMReview📱 (@iaumreview) February 18, 2023