ఇంటర్నెట్.. ఒకప్పుడు నెలకు 100 ఎంబీ రీఛార్జ్ చేసుకుని జాగ్రత్తగా వాడుకునేవాళ్లు. 1990ల్లో పుట్టిన వారికి అయితే ఈ డేటా రీఛార్జ్ ల గురించి బాగా తెలుసు. ఒక ఫొటో డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ఒక పాట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ఒక ఫేస్ బుక్ పోస్ట్ చేయాలన్నా ఎంత సమయం పట్టేదో వారిని అడిగితే చెబుతారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కేవలం 2 సెక్లలనో సినిమా డౌన్లోడ్ అయిపోతోంది. అయితే ఆ వేగానికి తగినట్లుగానే మీ మొబైల్ డేటా కూడా అంతే ఖర్చు అవుతోంది. రోజులో 1.5 జీబీ డేటా కూడా సరిపోవడం లేదు. అయితే మీరు కొన్ని టిప్స్ ని ఫాలో అయితే కచ్చితంగా డేటాని ఆదా చేసుకోవచ్చు. మరి.. ఆ టిప్స్ ఏంటో చూద్దామా..
మీరు డేటా ఆదాచేసుకునేందుకు ప్రతి స్మార్ట్ ఫోన్ లో ఈ డేటా సేవర్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఆ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుని ఉంచడం మంచిది. దీని ద్వారా మీ మొబైల్ డేటా ఆదా అవుతుంది. అనవసరపు యాప్స్, బ్యాగ్రౌండ్ యాప్స్ డేటా వాడకుండా ఈ సేవర్ మోడ్ అడ్డుకుంటుంది. మీరు ఈ ఆప్షన్ ని అపయోగించడం ద్వారా చాలా వరకు డేటా ఆదా కావడం గమనించవచ్చు.
స్మార్ట్ ఫోన్‌లో డేటాకి సంబంధించి పనికొచ్చే మరో ఫీచర్ డేటా లిమిట్. అవును మీ మొబైల్ లో మీరు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. దీనిని ఆన్ చేయడం ద్వారా మీరు రోజుకి ఎంత అయితే డేటా వినియోగించాలి అని లిమిట్ పెట్టారో అంతే వినియోగం అవుతుంది. ఆ లిమిట్ అయిపోయాక మొబైల్ డేటా ఆగిపోతుంది. మీరు లిమిట్ కి దగ్గర్లో ఉన్న సమయంలో మీకు నోటిఫికేషన్ కూడా పంపుతుంది. మొబైల్ సెట్టింగ్స్ లో డేటా లో ఈ ఫీచర్ ఉంటుంది.
మొబైల్ లో ఉన్న యాప్స్ అప్‌డేట్ అవుతూ ఉంటాయి. వాటికి యాప్స్ నుంచి అప్ డేట్ వచ్చిన ప్రతిసారి అవి అప్‌డేట్ అవుతుంది. మీరు దానిని ఆటేమేటిక్ గానీ, మొబైల్ డేటా అని గానీ ఉంటే మీతో ప్రమేయం లేకుండా యాప్స్ బ్యాగ్రౌండ్ లో అప్ డేట్ అవుతూనే ఉంటాయి. అలా అవ్వకూడదు అనుకుంటే మీరు యాప్ అప్ డేట్ ఆప్షన్ లో ఓన్లీ వైఫై మోడ్ అని ఆప్షన్ పెట్టుకోవాలి. దీని ద్వారా మొబైల్ డేటా సేవ్ అవుతుంది.
మొబైల్ లో మీరు చాలా యాప్స్ ని ఇన్ స్టాల్ చేసుకుంటారు. మీ అప్పటి అవసరాలకు తగినట్లుగా వాటిని డౌన్లోడ్ చేసుకుంటారు. కానీ, తర్వాత వాటిని ఉపయోగించే అవసరం రాకపోవచ్చు. కానీ, అవి మొబైల్ లో అలాగే ఉంటాయి. అలాంటి యాప్స్ ని అన్ ఇన్ స్టాల్ చేయడం ఉత్తమం. ఎందుకంటే.. వాటి వల్ల మీ మొబైల్ స్టోరేజ్ ఖాళీ అవుతుంది, వాటికి ఏమైనా అప్ డేట్స్ ఉంటే డేటా వేస్ట్ అవుతుంది. ర్యామ్ మీద కూడా పని భారం పెరుగుతుంది. కాబట్టి వాడని యాప్స్ ని అన్ ఇన్ స్టాల్ చేసుకోవడం బెటర్. ఇలాంటి సింపుల్ టిప్స్ ఫాలో అయితే తప్పకుండా డేటాని సేవ్ చేసుకోవచ్చు.