పబ్జీ ఈ గేమ్ గురించి, ప్రపంచ దేశాలలో దీని రీచ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవరం లేదు. భారత్ లో కూడా పబ్జీ సూపర్ సక్సెస్ అయ్యింది. కానీ.., అప్పట్లో దేశంలో నెలకొన్న కొన్ని ప్రత్యేక పరిస్థితిల కారణంగా పబ్జీ గేమ్ ని ఇండియాలో బ్యాన్ చేశారు. అప్పటి నుండి ఈ గేమ్ యూజర్స్.. కొత్త వెర్షన్ కోసం ఎదురుచూస్తూ వచ్చారు. వీరి కోసం క్రాఫ్టన్ అనే గేమింగ్ కంపెనీ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో పబ్జీ కొత్త వెర్షన్ ని ప్రత్యేకంగా ఇండియన్ యూజర్స్ కోసం సిద్ధం చేస్తోంది. ఇంకా దీని పబ్లిక్ వెర్షన్ ప్లే స్టోర్ లో అందుబాటులోకి రాలేదు. కానీ.., మే 18 నుంచి ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులకు ఆహ్వానించింది.
ఇప్పుడు అలా ప్రీ-రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి క్రాఫ్టన్ గుడ్ న్యూస్ అందించింది. ఎవరైతే ముందుగా ప్రీ-రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో వారికి గూగుల్ లాగిన్ ద్వారా పబ్ జి కొత్త వెర్షన్ ని ఇన్ స్టాల్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇలా లాగిన్ అయిన వారికి మాత్రమే ప్లే స్టోర్ లో ఇన్ స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అవ్వడానికి ఇది బీటా టెస్టింగ్ వెర్షనే అయినా.., యూజర్స్ మాత్రం ఈ అవకాశం కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఈ బీటా టెస్టింగ్ లో తమ యూజర్స్ తమ ఫీడ్ బ్యాక్ ని కంపెనీకి తెలియచేయవచ్చు. ఒక్కసారి పబ్లిక్ వర్షన్ అందుబాటులోకి వచ్చాక.., బీటా వెర్షన్ నుండి పబ్లిక్ వెర్షన్ కి అప్డేట్ అవ్వొచ్చు. ఇక ముందుగా ప్రీ-రిజిస్ట్రేషన్ చేసుకొని వారు కూడా ఇప్పుడు రిజిస్టర్ అయ్యి.., ఈ బీటా వెర్షన్ ని డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది క్రాఫ్టన్. ఇక పబ్జీ యూజర్స్ కి మరో గుడ్ న్యూస్ ఏమిటంటే తమ పబ్జీ ఓల్డ్ అకౌంట్ ని.. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాలో పొందవచ్చు.
బీటా టెస్టర్ లాగిన్ లింక్ – Battlegrounds Mobile India Beta Tester
BATTLEGROUNDS MOBILE INDIA Playstore Link – Download Here