సోషల్ మేసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు దాదాపుగా అన్ని స్మార్ట్ ఫోన్స్ లో ఈ వాట్సాప్ యాప్ ఉంటుంది. అందుకే వినియోగదారులను ఆకట్టుకునేందుకు వాట్సాప్ తరచూ కొత్త అప్డేట్స్, ఫీచర్లను పరిచయం చేస్తూ ఉంటుంది.
వాట్సాప్.. ఈ ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 5 బిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ తో ఈ మెసేజింగ్ యాప్ దూసుకుపోతోంది. ఈ సోషల్ మెసేజింగ్ యాప్ ద్వారా మెసేజ్ చేయడం మాత్రమే కాకుండా వీడియో కాల్స్, గ్రూప్ కాల్స్, గ్రూమ్ మెసేజింగ్, గ్రూప్ వీడియోకాల్స్ వంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఈ వాట్సాప్ లో ఉన్నాయి. చాలా మంది దీనిని వ్యక్తిగత అవసరాలకు మాత్రమే కాకుండా.. వ్యాపార అవసరాలకు కూడా ఉపయోగిస్తున్నారు. అందుకోసం వాట్సాప్ బిజినెస్ అని కూడా తీసుకొచ్చారు. వాట్సాప్ కంపెనీ తరచూ కొత్త ఫీచర్లు తీసుకొస్తూనే ఉంటుంది. తాజాగా వినియోగదారుల కోసం మరికొన్ని ఫీచర్లను తీసుకొచ్చింది.
వాట్సాప్ తమ వినియోగదారుల కోసం తరచూ కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంటుంది. మిగిలిన మెసేజింగ్ యాప్స్ తో పడేందుకు కూడా వాట్సాప్ సరికొత్త ఫీచర్లను, అప్ డేట్లను తీసుకొస్తుంటుంది. తాజాగా వాట్సాప్ నుంచి కొన్ని ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ముఖ్యంగా మీడియా షేరింగ్ అందరికీ పెద్ద రిలీఫ్ ని ఇచ్చింది. ఎందుకంటే గతంలో వాట్సాప్ ద్వారా మీరు కేవలం 30 ఫొటోలను మాత్రమే షేర్ చేయగలరు. కానీ, ఇప్పటి నుంచి మీరు వాట్సాప్ ద్వారా ఒకేసారి 100 ఫొటోల వరకు షేర్ చేసుకునే వెసులుబాటును తీసుకొచ్చారు. ఒక అకేషన్ కు సంబంధించి ఫొటోలను షేర్ చేసుకోవాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం, రిలీఫ్ అవుతుందని చెబుతున్నారు.
అంతేకాకుండా ఇప్పుడు గ్రూపులు, కమ్యూనిటీలను ఎక్కువగా క్రియేట్ చేస్తున్నారు. అలా చేసే సమయంలో మీ గ్రూపునకు సంబంధించి ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇస్తుంటారు. కానీ, అందుకు చాలా తక్కువ క్యారెక్టర్లలో మీ గ్రూపు గురించి చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ డిస్క్రిప్షన్ పరిధిని కాస్త పెంచారు. అంటే మీరు ఇక నుంచి మీ గ్రూపు గురించి మరింత ఎక్కువ విషయాలను డిస్క్రిప్షన్ లో పొందు పరిచేందుకు అవకాశం ఉంటుంది. ఇటీవలే వాట్సాప్ అవతార్ ఫీచర్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా మీకు నచ్చిన అవతార్ ను క్రియేట్ చేసుకుని డీపీగా వాడుకోవచ్చు. అలాగే ఆ అవతార్ తో మెసేజ్ లకు రిప్లై కూడా ఇవ్వచ్చు. ఈ అవతార్ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ యూజర్లకు తెగ నచ్చేస్తోంది.