మీకు మొబైల్ గేమ్స్ అంటే పిచ్చా? మొబైల్ గేమ్స్ ఆడడంలో తోపా? ఐతే రూ. 10 లక్షలు సంపాదించుకునే సువర్ణావకాశం మీ కోసమే. ప్రముఖ మొబైల్ కంపెనీ సరైన ఆటగాడి కోసం ఎదురుచూస్తుంది. బాగా మొబైల్ గేమ్స్ ఆడిన ఆటగాడికి రూ. 10 లక్షలు చెల్లిస్తుంది.
మొబైల్ గేమ్స్ ఆడడం అంటే మీకు ఇష్టమా? అయితే మీ ఇష్టాన్ని సంపాదనగా మార్చుకునే అవకాశం. గేమ్ ఆడితే ఆనందంతో పాటు రూ. 10 లక్షలు వస్తున్నాయంటే అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. మీరు కనుక ఆటగాళ్లు ఐతే కనుక ఈ అవకాశం మీ కోసమే. ఆటగాడివే అని అనిపించుకుంటే మీ ఖాతాలో రూ. 10 లక్షలు పడతాయి. ఈ అవకాశం ఐకూ కంపెనీ కల్పిస్తుంది. ఐకూ అనేది వివో నుంచి వచ్చిన బ్రాండ్, పాపులర్ పెర్ఫార్మెన్స్ స్మార్ట్ ఫోన్ మేకర్. మొబైల్ గేమింగ్, ఈ స్పోర్ట్స్ ని లవ్ చేసే యువకుల కోసం సరికొత్త అవకాశాన్ని కల్పిస్తుంది. చీఫ్ గేమింగ్ ఆఫీసర్ పొజిషన్ ని ఆఫర్ చేస్తుంది. మొబైల్ ఫోన్ లో బెస్ట్ గేమింగ్ మరియు ఈ స్పోర్ట్స్ అనుభూతిని కలిగించేందుకు కంపెనీతో కలిసి ఐకూ బ్రాండ్ కోసం పని చేసే యువ చీఫ్ గేమింగ్ ఆఫీసర్ కోసం కంపెనీ ఎదురుచూస్తున్నట్లు ప్రకటించింది.
ఈ చీఫ్ గేమింగ్ ఆఫీసర్ పొజిషన్ కి అప్లై చేయాలంటే వయసు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. ఆసక్తి గల ఆటగాడు అయి ఉండాలి. భారతదేశానికి చెందిన వారై ఉండాలి. ఐకూలోని లీడర్ షిప్ టీమ్, చీఫ్ గేమింగ్ ఆఫీసర్ ఇద్దరూ కలిసి ఒకరితో ఒకరు సహకరించుకుని, గేమింగ్ ఇన్సైట్స్ ని షేర్ చేసుకుంటూ గేమర్స్ కోసం ఫుల్ స్మార్ట్ ఫోన్ ప్యాకేజ్ ని అందించాలి. గేమ్ ప్లే, గేమింగ్ స్టైల్, ప్రెజెంటేషన్, గేమ్ ఇంటర్ ప్రిటేషన్స్ ఉండాలి. ఐకూ ఫోన్స్ లో రాబోయే గేమ్స్ ని అనుభూతి చెందడంతో పాటు గేమ్ ప్లే ఎలా ఉందో రివ్యూ ఇవ్వాల్సి ఉంటుంది. గేమింగ్ ఎకో సిస్టంలో ఐకూ ఉనికిని బలపరచాలి. భారత్ లోనే ఉత్తమమైన ప్లేయర్స్ తో ఆడే అవకాశం చీఫ్ గేమింగ్ ఆఫీసర్ కి ఉంటుంది. ఇండియాలో టాప్ గేమర్స్ తో ఇంటరాక్ట్ అవ్వచ్చు.
అంతేకాదు మొదటి చీఫ్ గేమింగ్ ఆఫీసర్ కి రివార్డ్ కూడా ఇస్తుంది. 6 నెలల పాటు ఈ చీఫ్ గేమింగ్ ఆఫీసర్ గా పని చేసి కాంటెస్ట్ లో గెలిస్తే రూ. 10 లక్షలు ఇస్తుంది కంపెనీ. ఈ కాంటెస్ట్ లో పాల్గొనాలంటే వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 11 2023 లోపు అప్లికేషన్లు స్వీకరిస్తారు. ఈ కాంటెస్ట్ లో చేరాలంటే నాలుగు రౌండ్లు ఉంటాయి. మొదటిది, ఐకూ గేమింగ్ ఎక్స్పర్ట్ లచే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. రెండవ రౌండ్, ఐకూ లీడర్ షిప్, స్పెషల్ జ్యూరీ మెంబర్ చేత వివరణాత్మక ప్రవేశం ఉంటుంది. మూడవది గేమింగ్ రౌండ్ ఉంటుంది. నాల్గవది ఆడిషన్ ఉంటుంది. ఇందులో ఎంపికైతే చీఫ్ గేమింగ్ ఆఫీసర్ కాంటెస్ట్ లో పాల్గొనవచ్చు. మరి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి.