ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ గురించే చర్చ జరుగుతోంది. అందులో మరీ ముఖ్యంగా చాట్ జీపీటీ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ చాట్ జీపీటీ ఒక సబ్ స్క్రిప్షన్ ప్లాన్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది.
చాట్ జీపీటీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఓపెన్ ఏఐ టెక్నాలజీ బ్రౌజర్ గురించే చర్చ జరుగుతోంది. దీనికి పోటీగా గూగుల్ బార్డ్ ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బార్డ్ టెస్టింట్ స్టేజ్ లో ఉంది. ఇటీవల బార్డ్ చేసిన తప్పిదం ఆల్ఫాబెట్ కొంప ముంచిన విషయం కూడా తెలిసిందే. ఆ ఘటనతో ఇప్పుడు మళ్లీ చాట్ జీపీటీనే హాట్ టాపిక్ గా మారింది. ఈ ఓపెన్ ఏఐ బ్రౌజర్ ని ఉచితంగానే వాడుకోవచ్చు. కానీ, దీనిలో సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ కూడా ఉంది. నెలకు ఇంత అంటూ కొంత మొత్తాన్ని కూడా నిర్ణయించారు. అంతేకాకుండా సబ్ స్క్రైబర్స్ కు అదనంగా కొన్ని సర్వీసెస్ ని కూడా అందజేస్తారు.
చాట్ జీపీటీ ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చిందనే చెప్పాలి. విడుదల చేసిన రెండు నెలల్లోనే 100 మిలియన్ యాక్టివ్ యూజర్లను సొంతం చేసుకుని బడా టెక్ కంపెనీలకే షాకిచ్చింది. ఇప్పుడు వీళ్లు నెలవారి సబ్ స్క్రిప్షన్ ప్లాన్ కూడా తీసుకొచ్చారు. వారి చాట్ జీపీటీని సబ్ స్క్రైబ్ చేసుకునేందుకు నెలకు 20 డాలర్లుగా నిర్ణయించారు. ప్రస్తుతానికి దీనిని అమెరికాలో స్టార్ చేశారు. అక్కడ కూడా ఈ సబ్ స్క్రిప్షన్ అవకాశాన్ని అందరికీ కల్పించడం లేదు. కేవలం కొందరికి మాత్రమే ముందుగా సబ్ స్క్రైబ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. అయితే చాట్ జీపీటీ ఫ్రీ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంటాయి.
చాట్ జీపీటీ ప్లస్ అంటూ ఈ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను తీసుకొచ్చారు. ఇప్పుడున్న జీపీటీ 3కి అదనంగా దీనిని జీపీటీ 3.5 వర్షన్ గా చెబుతున్నారు. సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారికి వేగంగా సమాచారం అందిచడం, పీక్ టైమ్ లో కూడా వారికి చాట్ జీపీటీ యాక్సెస్ కల్పించడం, కొత్త ఫీచర్లు వచ్చే సమయంలో ప్రీమియం సభ్యులకు ముందుగానే వాటిని అందుబాటులోకి తీసుకురావడం వంటి సదుపాయాలను కల్పిస్తున్నారు. ప్రస్తుతానికి ఇది అమెరికాకే పరిమితం చేసినా కూడా త్వరలోనే అన్ని దేశాలకు ఈ సేవలను విస్తృతం చేస్తారంటున్నారు. ప్రస్తుతం అంతా ఈ చాట్ జీపీటీ గురించే మాట్లాడుకుంటున్నారు.
ఏఐ టెక్నాలజీతో యాప్స్, బ్రౌజర్స్ రూపకల్పనపై ఎప్పటినుంచో టెక్ కంపెనీలు కృషి చేస్తున్నాయి. వాటిలో ప్రస్తుతం చాట్ జీపీటీ ముందు వరుసలో ఉంది. బ్రౌజర్ గా చాట్ జీపీటీ అందరినీ అబ్బుర పరిచినప్పటికీ దీనిపై విమర్శలు చేసేవాళ్లు కూడా లేకపోలేదు. చాట్ జీపీటీ వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. అనర్థాలు కూడా అంతే ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. ఈ సాంకేతికత వల్ల ఉద్యోగాలు పోవడమే కాకుండా.. సైబర్ అటాక్స్ కూడా ఎక్కవవుతాయంటున్నారు. ఇప్పిటికే దీనిపై బ్లాక్ బెర్రీ కంపెనీ కొన్ని రిపోర్టులను కూడా విడుదల చేసింది. టెక్ కంపెనీలన్నీ ఏఐ టెక్నాలజీ మీద పెట్టుబడులు పెట్టేందుకు బాగా ఉత్సుకతతో ఉన్నాయి.