మన ఫోన్లో అల్రెడీ సెవ్ చేసిన ఉన్న నంబరే, గతంల చాలా సార్లు ఆ నంబర్‌కు ఫోన్ చేసిన మాట్లాడాం. అయినా కూడా కొన్ని సార్లు వేరే వాళ్లుకు కాల్ వెళ్తుంది. రెండు మాటలు మాట్లాడిన తర్వాత రాంగ్ నంబర్ అని అవతలివాళ్లు అంటారు. మన ఫోన్లో మాత్రం మనం ఎవరికీ చేయాలనుకుంటామో వాళ్ల పేరుతోనే నంబర్ సేవ్ అయి ఉంటుంది. ఆ కాల్ కట్ చేసి మళ్లీ అదే నంబర్‌కు ట్రై చేస్తే ఈ సారి సరిగ్గానే కలుస్తుంది. ఈ రాంగ్ కాల్ చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఫోన్ హ్యాక్ అయితే ఇలా జరుగుతుందా? ఏవైనా అన్‌వాంటెడ్ యాప్స్ వల్ల ఇలా జరుగుతుందా? అనే ప్రశ్నలపై ప్రముఖ సైబర్ నిపుణులు శ్రీధర్ స్పందించారు.
ఆయన తెలిపిన వివరాలు మీ కోసం.. నెట్‌వర్క్, సెల్ టవర్‌పై లోడ్ ఎక్కువ అవ్వడం వల్లే మనం చేయాలనుకుంటున్న వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి ఫోన్ వెళ్తుందని, ఇలా జరగితే ఫోన్ హ్యాక్ అయినట్లు కాదని ఆయన తెలిపారు. మనకు బాగా తెలిసిన యాప్స్‌ను మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవాలని, వాటికి యాక్సెస్ పర్మిషన్ ఇచ్చే విషయంలో అప్రమత్తంగా ఉండాలి తెలిపారు. లింకుల ద్వారా యాప్స్ డౌన్‌లోడ్ చేయడం వల్ల మన డాటా చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని వివరించారు. అనవసరంగా ఫోన్‌లో ఎక్కువగా యాప్స్‌ను నింపుకోవద్దని సూచించారు. ఇన్‌స్టాల్ చేసి 6 నెలల పాటు వాడకుండా ఉన్న యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయడం మంచిదన్నారు. అనవసరపు లింకులను ఓపెన్ చేస్తే హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.