ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ కల్ట్ స్పోర్ట్ స్మార్ట్ వాచెస్ తయారీలోకి అడుగుపెట్టింది. ఆ బ్రాండ్ నుంచి తాజాగా రెండు స్మార్ట్ వాచెస్ రిలీజ్ అయ్యాయి. వాటి ఫీచర్స్, ధర చూస్తే ఇప్పటికే మార్కెట్ లో ఉన్న ఎన్నో ప్రముఖ వాచెస్ కి గట్టి పోటీ ఇస్తాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కల్ట్ స్పోర్ట్ ఇండియాలో ఎంత ఫేమస్ ఫిట్ నెస్ బ్రాండో అందరికీ తెలుసు. ముఖ్యంగా కల్ట్ ఫిట్ జిమ్స్ బాగా పాపులర్. అయితే ఇప్పుడు ఈ ఫిట్ నెస్ బ్రాండ్ స్మార్ట్ వాచ్ సెగ్మెంట్ లోకి అడుగుపెట్టింది. తాజాగా బడ్జెట్ రేంజ్ లో రెండు స్మార్ట్ వాచెస్ ను రిలీజ్ చేసింది. ఆ వాచెస్ ఫీచర్స్, ప్రైస్ చూస్తే ఇప్పటికే మార్కెట్ లో ఉన్న బోట్, ఫైర్ బోల్ట్, నాయిస్ వంటి కంపెనీలకు మంచి పోటీ ఇస్తాయని చెప్పచ్చు. పైగా కల్ట్ ఫిట్ జిమ్ లకు వచ్చే వాళ్లు ఈ వాచెస్ కొనడం మొదలు పెట్టినా కూడా చాలా గొప్ప మార్కెట్ క్రియేట్ అవుతుంది. మరి.. ఈ వాచెస్ ఫీచర్స్ ఏంటి? అవి ఎంత ధరకు అందుబాటులో ఉన్నాయి? మార్కెట్ లో లభిస్తున్న స్మార్ట్ వాచెస్ కి ఇవి బెటరేనా? అనే విషయాలు తెలుసుకుందాం.
కల్ట్ స్పోర్ట్ ఇప్పటికే ఇండియాలో బిగ్గెస్ట్ ఫిట్ నెస్ బ్రాండ్ గా ఎదిగింది. జిమ్స్, జిమ్ ఎక్విప్మెంట్, స్పోర్ట్స్, ఫిట్ నెస్ ఎక్విప్మెంట్ మార్కెట్ లో వినియోగదారుల మన్ననలు పొందింది. ఇప్పుడు ఈ బ్రాండ్ నుంచి బీట్స్- బర్న్ అనే రెండు స్మార్ట్ వాచెస్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. ఇంక వీటి ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ రెండు స్మార్ట్ వాచెస్ మోడల్స్ లో బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంది. వీటిలో ఇన్ బిల్ట్ స్పీకర్, మైక్ ఉన్నాయి. ఈ వాచెస్ లో 7 కాంటాక్స్ వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు. అలాగే కీపాడ్ ద్వారా కాల్స్ కూడా చేసుకోవచ్చు. బీట్స్ లో 1.85 ఇంచెస్ హెచ్ డీ డిస్ ప్లే, బర్న్ లో 1.78 ఇంచెస్ ఆమోలెడ్ డిస్ ప్లే ఉంది.
వీటిలో ఆల్వేస్ ఆన్ డిస్ ప్లే ఫీచర్ కూడా ఉంది. రెండు వాచెస్ 250 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నాయి. మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం రోజులపాటు వాడుకోవచ్చని చెబుతున్నారు. హెల్త్ విషయానికి వస్తే.. హార్ట్ రేట్ సెన్సార్, స్లీప్ ట్రాకర్, పిరయడ్ ట్రాకర్, బీపీ మోనిటర్, వాటర్ రిమైండర్, ఫుట్ కౌంట్ ట్రాకర్, క్రౌన్ హెడ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. రెండు వాచెస్ ఐపీ67 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తున్నాయి. వీటిలో వాయిస్ అసిస్టెన్స్, ఫైండ్ మై ఫోన్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. వీటి ధర బర్న్ స్మార్ట్ వాచ్ ని రూ.3,299కి, బీట్స్ వాచ్ ని రూ.2,199కి అందిస్తున్నారు. వీటిని కల్ట్ స్పోర్ట్.కామ్ లో అందుబాటులో ఉంచారు.
Cult. sport Beats, Burn smartwatches launched in India.
Beats – ₹2,199
Burn – ₹3,299 pic.twitter.com/WjNthwhoV0— Mukul Sharma (@stufflistings) March 2, 2023