యూత్, కాలేజీ కుర్రాళ్లకు బజాజ్ పల్సర్ బైక్ అంటే ఒక ఎమోషన్ అనే చెప్పాలి. బజాజ్ కంపెనీ నుంచి వచ్చిన అన్నీ మోడల్స్ లో పల్సర్ కి వచ్చిన క్రేజ్ నెక్ట్స్ లెవల్. ఇప్పుడు బజాజ్ పల్సర్ నుంచి ఎన్ఎస్200 అనే సరికొత్త మోడల్ మార్కెట్ లోకి విడుదలైంది. లుక్స్ పరంగా ఎంతో స్టైలిష్ గా ఉంది.
బజాజ్ కంపెనీ నుంచి వచ్చిన అన్ని మోడల్ బైక్స్ లో పల్సర్ టాప్ సెల్లింగ్ మోడల్ అని అందరికీ తెలిసిందే. ఈ పల్సర్ బైక్ ఎన్ఎస్ సిరీస్ లో ఇప్పటికే 125, 160సీసీ, 200ఎన్ఎస్ మోడల్స్ వచ్చాయి. వాటి తర్వాత ఇప్పుడు ఎన్ఎస్200 మోడల్ పల్సర్ బైక్ మార్కెట్ లోకి వచ్చేసింది. ఇటీవల బజాజ్ కంపెనీ ఎన్ఎస్200 టీజర్ ఇమేజెస్ ని విడుదల చేసింది. అయితే అధికారికంగా మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని వెల్లడించలేదు. కానీ, ఇప్పటికే డీలర్స్ దగ్గరకు ఈ పల్సర్ ఎన్ఎస్200 బైకులు చేరిపోయాయి కూడా. అందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఇంక ఈ బైక్ మోడల్ లో ఏం మార్పులు చేశారు? దీని ధర ఎంత? అని అప్పుడే వెతుకుకలాట మొదలు పెట్టేశారు.
బజాజ్ కంపెనీ నుంచి పల్సర్ మోడల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పల్సర్ బైక్ లో వచ్చిన దాదాపు అన్నీ మోడల్స్ క్లిక్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా పల్సర్ ఎన్ఎస్ 200 మోడల్ రిలీజ్ చేస్తున్నారు. అయితే టీజర్ పిక్స్ రిలీజ్ చేసిన కొన్ని రోజుల్లోనే మోడల్ బైక్ డీలర్ల దగ్గర ప్రత్యక్షమైంది. దాంతో అంతా ఈ బైక్ ధర ఎంత? స్పెఫికేషన్స్ ఏంటి అని వెతుకుతున్నారు. ఈ బైక్ లుక్స్ పరంగా ఎంతో స్టైలిష్ గా ఉన్నాయి. ఇంక కలర్స్ విషయానికి వస్తే ప్రస్తుతానికి వైట్ అండ్ రెడ్, బ్లాక్, రెడ్ అండ్ బ్లాక్ వేరియంట్స్ లో వస్తున్నట్లు చెబుతున్నారు. పల్సర్ 200ఎన్ఎస్ మోడల్ తో పోలిస్తే పెద్దగా మార్పులు చేయలేదనే తెలుస్తోంది.
ఈ పల్సర్ ఎన్ఎస్200 ఫీచర్స్ విషయానికి వస్తే.. హెడ్ లైట్, టెయిల్ ల్యాంప్ లు మాత్రం పాత్ డిజైన్ లోనే ఉన్నాయి. వెహికల్ పై గ్రాఫిక్స్ లో కాస్త ఛేంజెస్ చేశారు. ఈ మోడల్ గ్రాఫిక్స్ కాస్త డార్క్ ఎడిషన్ లా ఉన్నాయి. ఫ్రంట్ సస్పెన్షన్ లో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న యూఎస్డీ 33 ఎంఎం డయామీటర్ ఫోర్క్ ని పెట్టారు. ఇది పల్సర్ ప్రియులకు శుభవార్తనే చెప్పాలి. వెనుక భాగంలో మోనో షాక్ సస్పెన్షన్ ని అలాగే ఉంచారు. దీనిలో కూడా హెలో జెన్ లైట్స్ ఇస్తున్నారు. ఇంక ఏబీఎస్ టెక్నాలజీలో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. అలాగే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే గేర్ పొజిషన్ ఇండికేటర్ ని ఈ మోడల్ తో పరిచయం చేశారు. ఇంక ధర విషయానికి వస్తే.. హైదరాబాద్ లో ఈ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.40 లక్షలుగా చెబుతున్నారు. ఇంక కలర్ వేరియంట్ ని బట్టి కూడా రేటు మారే అవకాశం ఉంటుంది.