అంజిక్యా రహానే, చటేశ్వర్ పుజారాది టీమిండియా టెస్ట్ జట్టులో ప్రత్యేకస్థానం. టీమిండియా టెస్ట్ విజయాల్లో వీరి పాత్ర కీలకం. రహానే వన్డేలు కూడా ఆడుతున్నా.. పుజారా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్. కానీ ఈ మధ్య ఇద్దరు కూడా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నారు. ఇటివల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో ఇద్దరు కూడా విఫలమయ్యారు.
దీంతో వీరిపై క్రికెట్ విమర్శకులు విరుచుకుపడ్డారు. వీరి పని అనిపోయిందంటూ.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీసీఐ కూడా రహానేను టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్‌గా తొలగించి.. వేటు వేసింది. దీంతో వీరిని సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేస్తారా? లేదా? అనే అనుమానాలు కూడా వచ్చాయి. కానీ బీసీసీఐ ఇద్దరిపై నమ్మకం ఉంచి దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేసింది. ఆదివారం బాక్సింగ్ డే టెస్ట్‌తో సిరీస్ ప్రారంభం కానుంది. దీంతో మళ్లీ రహానే, పుజారా ఫామ్‌పై విమర్శలు వస్తున్నాయి.
ఈ సమయంలో టీమిండియా మాజీ ఆటగాడు జహీర్ ఖాన్.. రహానే, పుజారాకు అండగా నిలిచాడు. ఆటతోనే మీపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పాలని సూచించాడు. చూడాలి మరి జహీర్ ఖాన్ చెప్పినట్లు సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో రాణించి, విమర్శకుల నోర్లు మూయిస్తారా? లేదో?. మరి రహానే, పుజారా ఫామ్‌పై, జహీర్ సలహాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: టీమిండియా ప్రాక్టీస్ సెషన్ లో గొడవ! ద్రావిడ్ ముందే రచ్చ!
‘You just need to shut out the noise with your performances’: @ImZaheer’s advice for @ajinkyarahane88 and @cheteshwar1
INTERVIEW: https://t.co/yU6CHrlzjG 🏏#INDvSA #ZaheerKhan #AjinkyaRahane #CheteshwarPujara #INDvsSA #ViratKohli pic.twitter.com/s9QnJAqfZO
— TOI Sports (@toisports) December 25, 2021