మహారాష్ట్ర, పుణేలోని లుల్లా నగర్ చౌక్‌లో ఉన్న మార్వెల్ విస్టా భవనంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ భవనం యొక్క పై అంతస్తుల్లో ప్రమాదం జరగగా, ఇదే భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ రెస్టారెంట్ ఉంది. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లుగా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్ధలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
#BREAKING | Fire in Pune building where cricketer Zaheer Khan’s restaurant is located https://t.co/K5H4ObTKhU pic.twitter.com/VytsGPij7U
— NDTV (@ndtv) November 1, 2022