ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా రేపటి నుంచి తన వేట మొదలుపెట్టనుంది. ఎవరితో ఆడితే క్రికెట్ అభిమానులకు మజా వస్తుందో.. ఎవరిని ఓడిస్తే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఛాతీ ఉప్పొంగుతుందో.. ఆ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా జరిగే మ్యాచ్‌తో టీమిండియాకు అసలు సిసలైన వరల్డ్ కప్ పోటీలు ఆరంభం అవుతాయి. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో పాక్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకరం తీర్చుకుంటూ.. తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాలని రోహిత్ సేన మంచి కసి మీద ఉంది. ఇక ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
అలాగే ఈ మెగా ఫైట్‌తో పాటు వరల్డ్ కప్‌లో టీమిండియా విజయావకాశాలపై క్రికెట్ నిపుణులు, మాజీ క్రికెటర్లు తన అభిప్రాయాలను, అంచనాలను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్.. ఈ టీ20 వరల్డ్ కప్ ఫైనలిస్టులు ఎవరో తేల్చేశాడు. అలాగే ఈ టోర్నీలో టీమిండియా తరఫున హీరో కానున్న ఆటగాడు ఎవరో కూడా చెప్పేశాడు. ఈ ప్రపంచ కప్‌లో టీమిండియా హాట్ పేవరేట్‌గా ఉందని.. కీలక ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా గాయాలతో టోర్నీకి దూరమైనా.. టీమిండియా మంచి ప్రదర్శన కనబరుస్తుందనే భరోసా తనకు ఉందని జహీర్ భాయ్ పేర్కొన్నాడు. గత ఏడాది కాలంగా టీమిండియా నిలకడైన ప్రదర్శన కనబరుస్తుందని అన్నాడు. ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా ఒక బలమైన జట్టు.. అలాగే భారత్‌కు.. ఇంగ్లండ్ నుంచి గట్టిపోటీ ఉండే అవకాశం ఉంది. టీమిండియా ఫైనల్ చేరడం ఖాయంగా కనిస్తుందని, అలాగే ఇంగ్లండ్ కూడా ఫైనల్లో టీమిండియా ఢీకొంటుందని తనకు అనిపిస్తుందని జహీర్ పేర్కొన్నాడు.
ఇక ఈ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తరఫున మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ దుమ్మురేపుతాడని, ఈ టోర్నీకి టీమిండియా తరఫున అతనే టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని జహీర్ ఖాన్ ధీమా వ్యక్తం చేశాడు. సూర్య ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్నాడని, గ్రౌండ్‌కు అన్ని వైపులా ఆడే సామర్థ్యం ఉండటం కలిసొచ్చే అంశమని జహీర్‌ఖాన్ తెలిపాడు. ఇప్పటికే ఆస్ట్రేలియాతో వామప్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. పైగా ఆస్ట్రేలియా గ్రౌండ్స్ చాలా పెద్దవి కావడంతో సూర్యకుమార్ యాదవ్‌కు తిరుగుండదని క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి పాకిస్థాన్‌తో రేపు జరగబోయే మ్యాచ్‌లో సూర్య ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో వేచి చూడాలి.
‘I’m going to go with…’: Zaheer Khan opines the team to make it to T20 World Cup 2022 finalhttps://t.co/1rOZBXWDIS#t20worldcup2020 #indiavspakistan #wconsportstak#sportstak #Pakistankoharanahai @ImZaheer @ImRo45 pic.twitter.com/IGC2y3g0Vd
— Sports Tak (@sports_tak) October 21, 2022