యువీని మీకు పరిచయం చేయక్కర్లేదు. ఈ సిక్సర్ల రారాజు గురించి మీకు బాగా విదితమే. మరి అతని పక్కనున్న అందాల భామ ఎవరో తెలుసా..? ఒక భారత క్రికెటర్ భార్య. అంతేకాదు.. అంతకు ముందు ఆమె ఒక యువరాణి. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఆమె ఎవరో తెలుసుకుందామా..
ఇటీవల కాలంలో క్రికెటర్ల కంటే వారి భార్యలే ఎక్కువ పాపులర్ అవుతున్నారు. అందుకు చాహల్ భార్య.. ‘ధనశ్రీ’, రోహిత్ సతీమణి.. ‘రితికా’, సూర్యకుమార్ యాదవ్ అర్ధాంగి.. ‘దేవిషా శెట్టి’లే ప్రత్యక్ష ఉదాహరణలు. ఈ భామలు ఎప్పటికప్పుడు తమ ఫోటోలను/వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ తమ క్రేజ్ ను అమాంతం పెంచుకుంటున్నారు. మరి గతంలో సోషల్ మీడియా వాడకం చాలా తక్కువ. అందువల్ల కొందరు క్రికెటర్ల భార్యలు అభిమానులకు తెలియయకుండా ఉన్నారు. అందులో ఈ భామ ఒకరు. గతంలో యువరాజ్ పెళ్ళిలో జంటగా కనివిందు చేసిన ఈ అమ్ముడు, ఇప్పుడు మరోసారి యువీతో ఫోటోలు దిగింది. అవి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
పేరు.. సాగరిక ఘట్గే. భారత స్టార్ క్రికెటర్ జహీర్ ఖాన్ భార్య. అంతేకాదు ఈ అందాల భామ.. ఒక హీరోయిన్, హాకీ ప్లేయర్. రాజ కుటుంబానికి చెందిన యువరాణి కూడాను. ఈ విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. సాగరిక అమ్మమ్మ సీతరాజే ఘట్గే. ఇండోర్‌కు చెందిన మహారాజా తుకోజిరావ్ హోల్కర్ మూడవ కుమార్తె. కాకుంటే ఈ అమ్మడు సినిమాల మీద ఆసక్తితో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం.. ఆ తరువాత జహీర్ ఖాన్ కంటపడి అర్ధాంగిగా మారడం చకచకా జరిగిపోయాయి. వీరిది ప్రేమ వివాహం. ఓ పార్టీలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తరువాత చాలాకాలం పాటు వీరిద్దరూ రహస్యంగా కలుసుకునేవారు. కానీ యువరాజ్ సింగ్ వివాహంలో వీరు జంటగా కనిపించడం.. అది కాస్తా మీడియా కంట పడటంతో అందరికీ తెలిసిపోయింది.
మొదట వీరిద్దరూ తమ మధ్య ఉన్న బంధాన్ని అంగీకరించకపోయినా.. ఆ తర్వాత జహీర్ ఖాన్ ట్విట్టర్ వేదికగా తమ ప్రేమను అభిమానులకు తెలియజేశారు. ఆ తరువాత పెళ్లి పీటలెక్కారు. ఆ అమ్మడు యువీతో ఉన్న ఫోటో నెట్టింట మరోసారి వైరలవుతోంది. అక్కడ యువరాజ్ భార్య హెజెల్ కీచ్ కూడా ఉంది. సముద్రపు బీచ్ ఒడ్డున అందమైన త్రోబాక్ చిత్రంగా దీన్ని వైరల్ చేస్తున్నారు. ఇక జహీర్ ఖాన్ విషయానికొస్తే.. ఒకప్పుడు భారత జట్టులో ప్రధాన పేసర్ అంటే జహీరే. తన స్వింగ్ బౌలింగ్ తో దిగ్గజ బ్యాటర్లను సైతం ముప్పుతిప్పలు పెట్టేవాడు. 2011 వరల్డ్ కప్ భారత్ చేజిక్కించుకోవడంలో జహీర్ పాత్ర మరవలేనిది. టెస్టుల్లో 311, వన్డేల్లో 282 వికెట్లు తీసిన జహీర్… ముంబై జట్టుకు బౌలింగ్ కోచ్‌గా కూడా వ్యవహారించాడు. ఈ అందమైన త్రోబాక్ పిక్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sagarika Ghatge dazzled at Yuvraj Singh Hazel Keech’s wedding in Benarasi ensemble by JADE! #hazelkeech #yuvrajhazelwedding #monicakarishma pic.twitter.com/3xIlptbaoc
— syed farzan quadri (@syedfarzansmart) December 5, 2016
The beautiful throwback pic of Yuvraj Singh with wife Hezel Keech and bhabhi Sagarika Ghatge..#yuvrajsingh #hazeelkeech #sagarikaghatge pic.twitter.com/AZCNqOkox3
— Muskmelon (@gova3555) April 19, 2023