భారత జట్టు పేరుకు పెద్ద జట్టే కానీ.. 2011 తర్వాత వరల్డ్ కప్ నెగ్గలేదు. కొన్ని సార్లు సెమీస్ వరకు వచ్చి ఓటమి పాలైంది. అయితే.. 2019, 2021 వరల్డ్ కప్పులో మాత్రం టీమిండియా ఓటమికి బ్యాటర్లే కారణం అంటూ అశ్విన్ బాంబు పేల్చాడు.
పటిష్టమైన బ్యాటింగ్ లైనప్, మంచి బౌలింగ్ ఎటాక్ ఉన్న టీమిండియా.. గత కొన్నేళ్లుగా ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లలో ఒకటిగా ఉంది. ద్వైపాక్షిక సిరీస్‌లలో మంచి ప్రదర్శన కనబరుస్తున్న భారత్.. ఐసీసీ ఈవెంట్లలో మాత్రం నిరాశపరస్తోంది. 2019 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్, 2022 టీ20 వరల్డ్ కప్పుల్లో టీమిండియా భారీ అంచనాల నడుమ బరిలోకి దిగింది. కానీ.. అన్ని సార్లు నిరాశపర్చింది. అయితే.. ఈ మెగా టోర్నీల్లో టీమిండియా వైఫల్యానికి ప్రధాన కారణం ఇదే అంటూ టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వన్డే వరల్డ్ కప్ 2019లోనూ, టీ20 వరల్డ్ కప్ 2021లోనూ టీమిండియా కప్ కొట్టలేక విఫలం అయిందంటే అందుకు కారణం మన బ్యాటర్లు లెఫ్టార్మ్ పేసర్లను సరిగా ఆడలేకపోవడమేనని కుండబద్దలు కొట్టేశాడు. 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో ఆ జట్టు ఎడమ చేతి వాటం బౌలర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో మన బ్యాటర్లు ఇబ్బంది పడ్డారని, అలాగే 2021 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ ఎడమ చేతి వాటం బౌలర్ షాహీన్ షా అఫ్రిదీ బౌలింగ్‌లోనూ మన బ్యాటర్లు తీవ్ర ఇబ్బంది పడ్డారని అశ్విన్ పేర్కొన్నాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ అఫ్రిదీ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యారు.
అయితే.. టీమిండియా దిగ్గజ మాజీ లెఫ్టార్మ్ పేసర్ జహీర్ ఖాన్ తర్వాత అలాంటి మరో బౌలర్‌ను టీమిండియా సిద్ధం చేసుకోలేకపోయిందని.. అందుకు ప్రతిఫలంగా రెండు వరల్డ్ కప్పులో టీమిండియా మూల్యం చెల్లించుకుందని అశ్విన్ వెల్లడించాడు. విరాట్ కోహ్లీ నెట్స్‌లో బుమ్రా, షమీ, ఉమేష్ యాదవ్ బౌలింగ్‌ను ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తాడని.. వాళ్లు ముగ్గురు అద్భుతమైన బౌలర్లు అయినప్పటికీ ఎడమ చేతి బ్యాటర్లు కాకపోవడం మన బ్యాటర్లకు మైనస్‌గా మారిందని అన్నాడు. ఎడమచేతి బ్యాటర్లు వేసే ఇన్ స్వింగ్‌కు మన బ్యాటర్లు బాగా ఇబ్బంది పడతారని అన్నాడు. ఎడమ చేతి బ్యాటర్ల బౌలింగ్‌ను ఎక్కువ ప్రాక్టీస్ చేయలేక మ్యాచ్‌ల్లో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నాడు. మరి అశ్విన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shaheen Afridi took the wickets of Rohit Sharma, KL Rahul and Virat Kohli in this innings.
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 24, 2021