టీమిండియా మాజీ డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్.. టీమిండియా మెన్స్ క్రికెట్ కు వుమెన్స్ క్రికెట్ కు మధ్య ఉన్న తేడాను ఓ వీడియో ద్వారా వివరించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చెయ్యడమే కాక అందరిని ఆలోచింపజేస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుకుందాం.
అనాగరిక సమాజంలో స్త్రీ-పురుషుల మధ్య అసమానతలు ఉన్నాయంటే వారి ఆలోచనలు అభివృద్ధి చెందకపోవడం కారణం కావొచ్చు. కానీ ఆలోచనలు అభివృద్ధి చెందిన నేటి నాగరిక సమాజంలో కూడా స్త్రీ-పురుషుల మధ్య అసమానతలు ఉంటున్నాయి అంటే దానికి కచ్చితంగా మనమే కారణం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సమస్యను సృష్టించింది మనమే అంటున్నాడు టీమిండియా మాజీ డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. టీమిండియా మెన్స్ క్రికెట్ కు వుమెన్స్ క్రికెట్ కు మధ్య ఉన్న తేడాను ఓ వీడియో ద్వారా వివరించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చెయ్యడమే కాక అందరిని ఆలోచింపజేస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుకుందాం.
ప్రస్తుతం టీమిండియా జట్టు మంచి జోరు మీదుంది.. అనగానే మీకు ముందుగా గుర్తుకు వచ్చేది పురుషుల క్రికెట్ టీమ్ మాత్రమే. ఇక టీమిండియా కెప్టెన్ అనగానే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాల పేర్లే వినిపిస్తాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని ఆలోచింపజేసేలా ఓ వీడియో ద్వారా తెలిపాడు యువరాజ్ సింగ్. పురుషుల క్రికెట్ ఆధిపత్యంలో అద్భుతంగా రాణిస్తున్న మహిళా క్రికెట్ ను మనం మరచిపోతున్నాం అని యువీ పేర్కొన్నాడు. అయితే ఈ సమస్యను సృష్టించింది మనమే అని, దీనికి పరిష్కారం కూడా మనమే సూచించాలని తెలిపాడు. ప్రస్తుతం టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ కు దూసుకెళ్లిన సంగతి మనకు తెలిసిందే. ఇక సెమీస్ లో ఆసిస్ ను ఎదుర్కొనుంది భారత మహిళల జట్టు.
ఈ క్రమంలోనే టీమిండియా వుమెన్స్ కెప్టెన్ 150 అంతర్జాతీయ టీ20లు ఆడిన ప్లేయర్ గా వరల్డ్ రికార్డు నెలకొల్పిన సంగతి మనకు తెలిసిందే. ఇక వుమెన్స్ టీమ్ సెమీస్ కు వెళ్లిన వేళ జట్టుకు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు యువరాజ్ సింగ్. “గూగుల్ కు వెళ్లి ప్రస్తుత టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరు అని సెర్చ్ చేస్తే.. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాల పేర్లు మాత్రమే కనిపించాయి. ఎక్కడా హర్మన్ ప్రీత్ కౌర్ పేరు కనిపించలేదు. అయితే ఈ సమస్య మనమే సృష్టిస్తే.. దానికీ ఓ పరిష్కార మార్గం ఉంది. మనందరం మహిళల క్రికెట్ కోసం అది చేద్దాం. #IndianCricketTeamCaptainHarmanpreetKaur on #Twitter #Quora #LinkedIn and #Reddit ఈ పదాలను అన్నింటిలో షేర్ చేసి తప్పును సరిదిద్దుదాం” అని వీడియోతో కూడిన సందేశాన్ని అందించాడు.
దాంతో సగటు క్రికెట్ అభిమాని సైతం ఆలోచనలో పడ్డాడు. అవును యువీ చెప్పేది నిజమే కదా అని సమర్థిస్తున్నారు. మరో టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా కూడా యువీ ట్వీట్ ను రీట్విట్ చేశాడు. ఇక ప్రస్తుతం టీమిండియా వుమెన్స్ జట్టు టీ20 ప్రపంచ కప్ లో గొప్పగా రాణిస్తోంది. వరుస విజయాలతో సెమీస్ కు దూసుకొచ్చిన వేళ.. టీ20 వరల్డ్ కప్ సాధించాలని కోరుకుందాం. మరి టీమిండియా క్రికెట్ లో సమానత్వం కోసం యువరాజ్ షేర్ చేసిన వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
If we’ve created this problem,
we also have the power to fix it.Let’s do it for women’s cricket! 🏏💪🏻
Use this hashtag: #IndianCricketTeamCaptainHarmanpreetKaur
on #Twitter #Quora #LinkedIn and #Reddit
to spread the word and make a difference! 🇮🇳 pic.twitter.com/JMn5Cw7Cel
— Yuvraj Singh (@YUVSTRONG12) February 21, 2023