ఆటకన్నా మనుషులేం గొప్ప కాదు. ఎంత స్టార్ ఆటగాళ్లైనా సత్ప్రవర్తనతో నడుచుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ విషయంలో టీమిండియా ఉమెన్స్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ హర్మన్ ప్రీత్ కౌర్ మినహాయింపేమీ కాదు.
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రవర్తన ప్రస్తుతం ఎవరికీ నచ్చడం లేదు. తాజాగా భారత మాజీ క్రికెటర్ మదనలాల్ హర్మాన్ చేసిన పనిని తప్పు పట్టాడు. ఆమె భారత క్రికెట్ పరువు తీసిందని సస్పెండ్ చేయాలని కోరాడు.
బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఉమెన్స్ జట్టు మ్యాచ్ ని టై చేసుకుంది. ఈ మ్యాచు అనంతరం హర్మన్ అంపైర్ పై చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రతిష్టాత్మక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైపోయింది. ఉమెన్స్ క్రికెట్‌లో ఒక మైలురాయిగా చెప్పుకుంటున్న ఈ డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.
మహిళల టీ20 ప్రపంచ కప్ లో పోరులో టీమిండియా పోరాటం ముగిసింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 173 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా, అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 167 పరుగులకే పరిమితమయ్యింది.
టీమిండియా మాజీ డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్.. టీమిండియా మెన్స్ క్రికెట్ కు వుమెన్స్ క్రికెట్ కు మధ్య ఉన్న తేడాను ఓ వీడియో ద్వారా వివరించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చెయ్యడమే కాక అందరిని ఆలోచింపజేస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుకుందాం.
హర్మన్ ప్రీత్ కౌర్.. టీమిండియా మహిళల జట్టుకు సారథిగా ఎన్నో చిరస్మరణియమైన విజయాలను అందించింది. తాజాగా జరుగుతున్న టీ20 వుమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో అరుదైన రికార్డును నెలకొల్పింది టీమిండియా సారథి.
భారత మహిళలు మరో ప్రతిష్టాత్మక టోర్నీకి సిద్ధమవుతున్నారు. దక్షిణాఫ్రికా గడ్డ మీద ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ విమెన్స్ టీ20 వరల్డ్ కప్ కోసం సన్నద్ధమవుతున్నారు. ఇటీవల సౌతాఫ్రికాలోనే నిర్వహించిన అండర్-19 మహిళల కప్‌ను టీమిండియా గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోయే పొట్టి ప్రపంచ కప్‌ను చేజిక్కించుకునేందుకు సీనియర్ విమెన్స్ టీమ్ రెడీ అవుతోంది. 10 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ […]
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరున్న బీసీసీఐ.. ప్రస్తుతం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పురుష క్రికెటర్లను, మెన్స్ టీమ్‌ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే బీసీసీఐ.. ఉమెన్స్ క్రికెట్ టీమ్‌పై మాత్రం చిన్నచూపు చూస్తోందంటూ క్రికెట్ అభిమానుల మండిపడుతున్నారు. అందుకు కారణం.. తమ టీమ్‌కు ఒక బౌలింగ్ కోచ్‌ను నియమించమని సాక్ష్యాత్తు భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అభ్యర్థించడమే. ఇటివల ఆస్ట్రేలియాలపై రెండో వన్డేలో గెలిచి.. ఆసీస్ వరుస విజయాల పరంపరకు బ్రేక్ వేసిన టీమిండియా.. […]