ధనాధన్ క్రికెట్ హంగామా ఐపీఎల్ 15వ సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో అన్ని జట్లు ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఆటగాడు, భారత అండర్-19 కెప్టెన్ యష్ ధుల్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. నెట్ సెషన్‌లో అద్భుతమైన షాట్‌లు ఆడుతూ యష్ ధుల్ అలరించాడు. అయితే ప్రాక్టీస్‌లో భాగంగా ఒక బంతిని ‘అప్పర్ కట్’ షాట్ ఆడి అందరనీ ఆశ్చర్యపరిచాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అండర్-19 ప్రపంచకప్ 2022లో యశ్ ధుల్ భారత జట్టును ఛాంపియన్‌గా నిలిపిన సంగతి తెలిసిందే. గతంలో 2007లో విరాట్ కోహ్లీ టీమిండియా అండర్ 19 జట్టుకు కెప్టెన్‌గా భారత్‌కు వరల్డ్ కప్ అందించి.. ఆ తర్వాత 2008లో ఐపీఎల్‌లో ఆడుగుపెట్టి అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు యశ్ కూడా జూనియర్ కోహ్లీలాగే భారత్‌కు కప్ అందించి.. ఐపీఎల్‌లోకి అడుగుపెట్టనున్నాడు.
మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ యశ్‌ను రూ.50 లక్షలకు దక్కించుకుంది. కాగా టోర్నీ ప్రారంభానికి ముందే ఈ డిఫరెంట్ షాట్‌తో టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్‌గా మారిపోయాడు యశ్. అతను ఆడిన షాట్‌ను ప్రపంచ క్రికెట్‌లో మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్‌గా పేరొందిన ఏబీ డివిలియర్స్ కూడా ఆడలేడంటూ.. క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మరి యశ్ ఆడిన షాట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: షాకింగ్ న్యూస్! ఢిల్లీ క్యాపిటల్స్ బస్సుపై దాడి..!
That No-look was S.M.O.O.T.H 🤌
🔝 Upper Cut 🔥 @YashDhull2002 🤩#YehHaiNayiDilli #IPL2022 pic.twitter.com/vrnyoso5MS
— Delhi Capitals (@DelhiCapitals) March 21, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.